యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైలెన్స్ వెనుక ప్రముఖ రాజకీయ నేత.. ఆయన మాట వల్లే సైలెంట్ అయ్యారా?

చంద్రబాబు అరెస్ట్( Chandrababu arrest ) తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాగే ఏపీ పాలిటిక్స్ లో ఎన్నో రకాల ప్రశ్నలు అనుమానాలు తలెత్తుతున్న విషయం మనందరికీ తెలిసిందే.ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంపై స్పందించకపోవడంతో అది అనేక రకాల అనుమానాలకు తావిస్తోంది.

 Did Jr Ntr Know That Chandrababu Will Be Arrested, Jr Ntr, Chandrababu , Amith S-TeluguStop.com

చంద్రబాబు అరెస్ట్ వెనుక పక్క వ్యూహం ఉన్నట్టుగా తెలుస్తోంది.ఈ సంగతి పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ స్పందించకపోవడానికి కారణం ఒకటి ఉంది.

ఆయన వెనుక ఒక రాజకీయ నేత ఉన్నారంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఏడాది కిందటే జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు అరెస్టు విషయమై బీజేపీ అగ్రనేత అమిత్ షా ఒక హింట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

Telugu Amith Sha, Chandrababu, Jr Ntr, Kalyan Ram, Bhuvaneshwari, Ntr Science-Mo

తెలుగుదేశం పార్టీతో జూనియర్ ఎన్టీఆర్( JR ntr ) ది సుదీర్ఘ సంబంధం.తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదంటూనే పుష్కర కాలం కిందటే తెలుగుదేశం పార్టీ ప్రచార బాధ్యతలు తీసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్.చంద్రబాబు కుటుంబంతో అరమరికలు ఉన్నా బాబాయ్ బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబ సభ్యులతో సఖ్యత లేకున్నా తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చేసరికి తారక్ చాలా అనుకూలత ప్రదర్శించేవారు.అప్పట్లో తన మనిషిగా ముద్రపడిన కొడాలి నాని టీడీపీ ని వీడినప్పుడు తారక్ ప్రత్యేక ప్రకటన ఇచ్చారు.

తన కట్టే కాలే వరకు టీడీపీ లో కొనసాగుతానని స్పష్టం చేశారు.పార్టీ కష్టంలో ఉంటే తాను ఒక సామాన్య కార్యకర్తగా సేవలు అందిస్తానని చెప్పుకొచ్చారు.అందుకు తగ్గట్టుగానే పార్టీ సంక్షోభాలు, సమస్యల్లో ఉన్నప్పుడు స్పందించారు.

Telugu Amith Sha, Chandrababu, Jr Ntr, Kalyan Ram, Bhuvaneshwari, Ntr Science-Mo

మొన్నటికి మొన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు సైతం స్పందించారు.మేనత్త భువనేశ్వరిపై( Nara Bhuvaneshwari ) వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు సైతం తారక్ ప్రత్యేక ప్రకటన చేశారు.తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అవి ఆశించిన స్థాయిలో రుచించకపోయినా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాననే సంకేతాలు ఇచ్చారు.

కానీ చంద్రబాబు అరెస్టు విషయంలో ఇంతవరకు స్పందించకపోవడం కాస్త విమర్శలకు తావిస్తోంది.చంద్రబాబు అరెస్ట్ అయి 15 రోజులు కావస్తున్నా తారక్ కానీ ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ కానీ స్పందించలేదు.

దేశ విదేశాల నుంచి చంద్రబాబుకు స్పందనలు వెల్లువెత్తుతున్నా తోటి కుటుంబ సభ్యులు మద్దతు తెలిపినా తారక్ మాత్రం స్పందించడం లేదు.కాగా ఏడాది కిందట అమిత్ షా ను జూనియర్ ఎన్టీఆర్ కలిసారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో ఉత్తమ నటన గాను తారక్ ను అభినందించేందుకు అమిత్ షా పిలిపించుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది.అయితే తాజాగా నాటి కలయికపై మరోలా ప్రచారం జరుగుతోంది.

చంద్రబాబును అరెస్టు చేస్తారని అమిత్ షా తారక్ కు చెప్పారని ఆ సమయంలో చంద్రబాబు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ సంఘీభావం తెలపొద్దని తారక్ వద్ద అమిత్ షా మాట తీసుకున్నారని టాక్ నడుస్తోంది.అందుకే చంద్రబాబు అరెస్టు విషయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube