మెగా ఫ్యామిలీకి చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ అలా చేశారా.. నిజ‌మెంత‌..?

ఏపీ రాజ‌కీయాల్లో జ‌గ‌న్ ఎంత బ‌ల‌మైన నేత‌గా ఉన్నారో అంద‌రికీ తెలిసిందే.ఎంత‌మంది పోటీకి వ‌చ్చినా స‌రే ఆయ‌న ముందు తేలిపోతున్నారు.

 Did Jagan Do That To Give A Check To Mega Family Really-TeluguStop.com

ఆయ‌న రాజకీయంగా ఇప్పుడు అందిరికంటా బ‌లంగా ఉన్నారు.ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌కే ఇప్పుడు మంచి ఆద‌ర‌ణ ఉంది.

ఆయ‌న పేరు చెబితే చాలు ఎవ‌రికైనా ఓట్లు ప‌డుతాయేమో అన్న‌ట్టు ఉంది ప‌రిస్థితి.ఆయ‌న గెల‌వ‌డ‌మే కాదు త‌న‌ను న‌మ్ముకున్న వారిని కూడా గెలిపిస్తున్నారు.

 Did Jagan Do That To Give A Check To Mega Family Really-మెగా ఫ్యామిలీకి చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ అలా చేశారా.. నిజ‌మెంత‌..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఏపీ రాజ‌కీయాల్లో మెగా ఫ్యామిలీ ప‌రిస్థితి ఏంటో కూడా అంద‌రికీ తెలిసిందే.వారు క‌నీంస పోటీ కూడా ఇవ్వ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్నారు.

గ‌తంలో చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టి ఫెయిల్ అయిపోయారు.ఇక ఆ త‌ర్వాత పవన్ క‌ల్యాణ్ జ‌న‌సేన అంటూ ముందుకువ వ‌చ్చే ప్ర‌య‌త్నం చేసినా కూడా అది పెద్ద‌గా ఫ‌లించ‌ట్లేదు.

ఎందుకంటే ఆయ‌నే రెండు చోట్ల ఓడిపోయి దీన స్థితిలో ఉన్నారు.అలాంటి వ్య‌క్తిని జ‌గ‌న్ లాంటి నేత పెద్ద సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన ప‌నిలేదు.ఇక‌పోతే ఆయ‌న అన్న‌య్య నాగబాబు కూడా నరసాపురం పార్లమెంట్ కు పోటీ చేసి చిత్తుగా ఓడి ప‌రువు పోగొట్టుకున్నారు.మొత్తంగా చూస్తే మెగా ఫ్యామిలీ ప్ర‌భావం ఏపీ రాజకీయాల్లో ఏ మేర‌కు ఉందో అర్థమైపోయిది.

Telugu Ap Poltics, Chiranjeevi, Jagan, Janaseena, Mega Family, Nagababu, Pawan Kalyan, Prajarajyam Party-Telugu Political News

మ‌రి అలాంటి వారికి చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ మొన్న జ‌రిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణును ద‌గ్గ‌రుండి గెలిపించుకున్నార‌ని ఆయ‌న ద్వారా చెక్ పెట్టార‌ని పెద్ద ఎత్తున ట్రోలింగ్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.ద‌గ్గ‌రి బంధువైన మంచువిష్ణు వెన‌క జ‌గ‌న్ ఉండి మా ఎల‌క్ష‌న్ల‌లో గెలిపించుకున్నార‌ని త్ద‌వారా మెగా ఫ్యామిలీ ప్ర‌భావాన్ని పూర్తిగా త‌గ్గించేసి ఇటు ఏపీ రాజకీయాల్లో ఎదురు లేకుండాచూసుకున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.అస‌లు జ‌గ‌న్‌కు అలాంటి అవ‌స‌రం ఉందా.జ‌గ‌న్ లాంటి బ‌ల‌మైన నేత మంచు విష్ణు సాయం కోరుతారా.ఇక మెగా ఫ్యామిలీ ప్ర‌భావం ఏంటో గ‌త ఎన్నిక‌ల్లోనే అర్థ‌మ‌యిపోయిన‌ప్పుడు ఆయ‌న ఇలాంటి స్కెచ్ వేయాల్సిన అవ‌స‌రం లేద‌ని చెబుతున్నారు విశ్లేష‌కులు.

#Jagan #Family #Pawan Kalyan #AP Poltics #Nagababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు