అమరావతే ఏకైక రాజధానిగా జగన్ డిసైడ్ అయ్యారా?

ఏపీలో వైసీపీ సర్కారు వచ్చాక రాజధాని అమరావతిని కాదని మూడు రాజధానులు నిర్మిస్తామని ప్రకటించింది.దీంతో అమరావతిలో రైతులందరూ ఆందోళన బాట పట్టారు.

 Did Jagan Decide To Make Amravati The Only Capital , Andhra Pradesh , Amaravathi-TeluguStop.com

అయినా రైతుల ఆందోళనను జగన్ ప్రభుత్వం చిన్నచూపు చూసింది.ఆందోళన చేసే వాళ్లు రైతులు కాదని.

టీడీపీ కార్యకర్తలు అని విమర్శలు చేసింది.వైసీపీ సర్కారుతో లాభం కనిపించకపోవడంతో అమరావతి రాజధాని రైతులందరూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలో అమరావతిలో రాజధాని అభివృద్ధి చేయాల్సిందేనంటూ హైకోర్టు తీర్పు వెల్లడించింది.దీంతో జగన్ సర్కార్‌కు దినదిన గండంగా మారిపోయింది.అసలే నిధుల కొరతతో అల్లాడుతున్న వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు శరాఘాతంలా మారిపోయింది.చివరకు చేసేదేమీలేక హైకోర్టు తీర్పు మేరకు అమరావతే ఏకైక రాజధాని అని వైసీపీ ప్రభుత్వం ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది.

దీంతో అమరావతి అభివృద్ధి కోసం భూములను అమ్మకానికి పెట్టింది.

Telugu Amaravathi, Andhra Pradesh, Ap, Chandrababu, Cm Jagan, Jagan, Tdp, Telugu

ఆనాడు చంద్రబాబు సర్కారు రాజధాని కోసం సేకరించిన భూములే ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి అతి పెద్ద ఆర్ధిక దిక్కుగా మారాయి.ఆనాడు ఏకంగా 600 ఎకరాలను చంద్రబాబు సర్కారు ఇతర కార్యక్రమాల కోసం అని పక్కన పెట్టగా.ఇప్పుడు ఆయా భూములను విడతల వారీగా అమ్ముకునేందుకు సీఆర్‌డీఏకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఎకరం భూమి రూ.10 కోట్లుగా విక్రయించాలని ఏపీ సర్కారు భావిస్తోంది.248 ఎకరాలను వేలం వేసి రూ.2,480 కోట్లను ఆర్జించాలని సన్నాహాలు చేస్తోంది.

Telugu Amaravathi, Andhra Pradesh, Ap, Chandrababu, Cm Jagan, Jagan, Tdp, Telugu

అమరావతి నిర్మాణానికి బ్యాంకులు రుణాలివ్వకపోవడంతో సొంతంగా నిధులు సమీకరించుకునే క్రమంలో ఏపీ ప్రభుత్వం భూముల విక్రయానికి సిద్ధమైంది.గతంలో బీఆర్ షెట్టి మెడిసిటీ కోసం ఇచ్చిన 100 ఎకరాలు, లండన్ కింగ్స్ కాలేజీకి ఇచ్చిన 148 ఎకరాలను విక్రయించాలని ప్రభుత్వం విక్రయించనుంది.ఆయా సంస్థలకు భూములు కేటాయించినా ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఆ భూములు విక్రయించాలని జగన్ సర్కారు భావిస్తోంది.ప్రభుత్వం అమ్మాలనుకున్న 600 ఎకరాలను ఏడాదికి 50 ఎకరాల చొప్పున విక్రయించేందుకు కసరత్తు చేస్తోంది.

అయితే ఆనాడు స్మశానం అని ఆరోపించిన వైసీపీ.ఇప్పుడు భూములను అమ్మడమేంటని టీడీపీ గట్టిగానే ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube