ఐసీసీ అధ్యక్ష పదవిని గంగూలీ వద్దనుకున్నాడా..?!

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న క్రికెట్ బోర్డు ఏది అంటే టక్కున సమాధానం బీసీసీఐ అని చెప్పేస్తారు.ఐసీసీలో కూడా భారతదేశ క్రికెట్ మండలి కీలక పాత్ర పోషిస్తూనే ఉంటుంది.

 Did Ganguly Not Want To Be Icc President  Icc, Bcci, Ipl, Ipl 2020, Sourabh Gang-TeluguStop.com

ఇకపోతే 2020 డిసెంబర్ నెలలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కు కొత్త అధ్యక్షుడు రావాల్సి ఉండగా అందుకు సంబంధించి ప్రస్తుతం బిసిసిఐకి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న సౌరవ్ గంగూలి ఎన్నిక అవుతారని ఎన్నో కథనాలు వినిపించాయి.అయితే ఇందుకు కారణంగా సౌరవ్ గంగూలీ ఒక సమర్థ నాయకుడని ఎన్నో వార్తలు కూడా వినిపించాయి.

ఇందుకు సంబంధించి ఎంతోమంది పలువురు మాజీ క్రికెటర్లు, అలాగే క్రికెట్ బోర్డు సంబంధించిన పెద్దలు కూడా వ్యాఖ్యానించారు.

కాకపోతే ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఇందుకు విరుద్ధంగా ఉంది.

దీనికి కారణం గంగూలీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పదవిని వద్దనుకున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు ఐసిసి అధ్యక్ష పీఠం కావాలని కోరుకోవటం లేదని సమాచారం.

ముఖ్యంగా అందరూ అనుకున్నట్టుగానే సౌరబ్ గంగూలీ ఐసీసీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తారు అని భావించిన.మొత్తానికి అది జరిగేలా కనబడట్లేదు.

కొంతకాలం కిందట ఐసిసి అధ్యక్ష పీఠం నుండి భారతదేశానికి చెందిన శశాంక్ మనోహర్ తప్పుకోగా ఆ పదవి కోసం నామినేషన్లు దాఖలు చేసేందుకు అక్టోబర్ 18వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు.అయితే ప్రస్తుతం అక్టోబర్ 18 గడువు ముగిసిపోవడంతో సమయం లోపల గంగూలీ ఆ పదవికి నామినేషన్ వేయలేదు.

ఈ విషయం బట్టి చూస్తే గంగూలికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్ష పదవిని చేపట్టడం ఇష్టం లేదని అర్థం అవుతోంది.ప్రస్తుతానికి సౌరవ్ గంగూలీ ఆ బాధ్యతలు తనకు వద్దని భవిష్యత్తులో ఐసీసీపై దృష్టిని సాధించవచ్చని ప్రస్తుతం ఈ పోటీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈయన ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ను అద్భుతంగా నిర్వహించేందుకు అక్కడే ఉండి ఏర్పాట్లను దగ్గరుండి గమనిస్తున్నారు.ఇకపోతే ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత ఆటగాళ్లు అక్కడి నుంచి డైరెక్ట్ గా ఆస్ట్రేలియా దేశ పర్యటనకు వెళ్లనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube