టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే.ఎందుకంటే నటుడిగా ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో.
వ్యక్తిగత విషయాల పట్ల కూడా అంతే గుర్తింపు తెచ్చుకున్నాడు.దాదాపు 150కి పైగా సినిమాలలో నటించి టాలీవుడ్ మెగాస్టార్ గా నిలిచాడు.
ఇక ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూ యంగ్ హీరోలతో పోటీగా దూసుకెళ్తున్నాడు.ఇక సోషల్ మీడియా ప్రభావం చిరుపై బాగానే ఉంది.
నిత్యం ఏదో ఒక పోస్టును అభిమానులతో పంచుకుంటుంటాడు.ఇదిలా ఉంటే ఈయన నటన చూసి చాలామంది నవ్వుకున్నారట.
అదేంటి చిరంజీవి నటనను చూసి ఇంతవరకు ఎవరూ కూడా వేలెత్తి చూపించలేనిది.ఏకంగా ఆయన నటనను చూసి నవ్వుకోవడం ఏంటి అనుకుంటున్నారా.ఇది ఎగతాళిగా నవ్విన నవ్వు మాత్రం కాదు.కేవలం సినిమా చిత్రీకరణ సమయంలో తన కామెడీ టైమింగ్ అనేది బాగా అద్భుతంగా ఉండేదట.
స్క్రిప్టులో ఉండేది కొంచెం భాగమైతే అందులో మరికొంత వినోదాన్ని అందిస్తూ నటించేవాడట చిరంజీవి.అలా సన్నివేశం సమయంలో చిరంజీవి నటిస్తుంటే నవ్వాపుకోలేక పోయేవాళ్ళట.
పైగా ప్రేక్షకులను కూడా విపరీతంగా నవ్వించాడట చిరంజీవి.

ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు.సౌందర్య, రవితేజ, వెంకట్ నటించిన సినిమా ‘అన్నయ్య’ లోనిది.ఈ సినిమా మంచి కామెడీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
దీంతో ఈ సినిమా గురించి ముత్యాల సుబ్బయ్య కొన్ని విషయాలు చెబుతుండగా అందులో చిరంజీవి నటన గురించి అభిమానులతో పంచుకున్నాడు.

ఇక ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఆచార్య‘ సినిమాలో నటిస్తున్నాడు.ఇందులో రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా తర్వాత లూసిఫర్ రీమేక్ చేయనున్నాడు.
ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నాడు.బాబీ దర్శకత్వంలో కూడా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై మరో సినిమా చేయనున్నాడు.
ఇక రమేష్ దర్శకత్వంలో వేదళమ్ రీమేక్ లో నటించనున్నట్లు గతంలో ప్రకటించారు.మొత్తానికి చిరంజీవి వరుస అవకాశాలతో బాగా బిజీగా మారాడు.