రాజమౌళి సాయం లేకుండానే బన్నీ ఆ స్థాయికి చేరాడా?

బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేశారు.ఈ విధంగా బాహుబలి సినిమా ద్వారా దేశవ్యాప్తంగా ప్రభాస్ కు మంచి క్రేజ్ ఏర్పడింది.

 Did Allu Arjun Reach Pan India Level Without The Help Of Rajamouli Details,  All-TeluguStop.com

ఈ క్రమంలోనే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మంచి గుర్తింపు పొంది ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా స్థాయిలోనే తెరకెక్కుతున్నాయి.ఇలా ఏ హీరో అయినా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకోవాలంటే రాజమౌళి సాయం తప్పకుండా ఉండాలని చాలా మంది భావించారు.

ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో పలువురు హీరోల సినిమాలు విడుదల అయినప్పటికీ ఆ హీరోలకు పెద్దగా ఆశించినంత ఫలితాలు రాలేదు.

ఇక బాహుబలి సినిమా తర్వాత ఎన్టీఆర్ ,రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి అత్యంత భారీ బడ్జెట్ తో RRR సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా జనవరి 7వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాయిదా పడింది.ఇకపోతే ఈ సినిమా ద్వారా ఈ ఇద్దరు హీరోలకి మంచి క్రేజ్ ఏర్పడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇకపోతే అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కింది.

Telugu Allu Arjun, Pan India, Panindia, Pushpa, Rajamouli, Ram Charna, Rrr, Suku

ఈ సినిమా కూడా దక్షిణాది రాష్ట్రాలలో కాకుండా ఉత్తరాది రాష్ట్రాలలో కూడా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసింది.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కు పాన్ ఇండియా హీరోగా పుష్ప సినిమా మంచి గుర్తింపు తీసుకు వచ్చిందని చెప్పవచ్చు.మరి రాజమౌళి సహాయం ఏ విధంగాను లేకుండా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయమని చెప్పవచ్చు.

ఇలా టాలీవుడ్ స్టార్ హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ హీరో స్థాయికి అల్లుఅర్జున్ చేరుకున్నారు.ప్రస్తుతం అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలలో భారీ కలెక్షన్లను రాబట్టి ఫేస్ జోన్ లోకి వెళ్ళిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube