బీజేపీ మార్క్ రాజకీయం తెలంగాణలో మొదలైనట్టేనా?

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల తూటాలు పేలడమే కాదు, పరిస్థితులు రణరంగంగా మారిన పరిస్థితి ఉంది.జీవో 317 లో సవరణ చేపట్టాలంటూ జనజాగరణ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

 Did Bjp Mark Politics Start In Telangana Telangana Politics, Kcr, Bjp Party , Tr-TeluguStop.com

అయితే ఇటీవల అమిత్ షాతో భేటీ అయిన తరువాత బీజేపీ మరింతగా దూకుడు పెంచిన విషయం తెలిసిందే.ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండేలా కార్యాచరణను సిద్దం చేసుకోవాలని అప్పుడే వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉందని సూచించిన విషయం తెలిసిందే.

దీంతో అప్పటి నుండి ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించు కుంటున్నారు.ఇక టీఆర్ఎస్ తరువాత రెండో ప్రత్యామ్నాయ స్థానం కొరకు పోటీ పడుతున్న బీజేపీ మిగతా రాష్ట్రాలలో ఎలా వ్యవహరించి ఒక బలమైన పార్టీగా ఎదిగిందో ఇక్కడ తనదైన మార్క్ రాజకీయం బీజేపీ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.

బీజేపీ పార్టీ ఎప్పుడైనా తాము పాగా వేయాలనుకుంటున్న రాష్ట్రంలోనైనా ముందుగా భయాందోళన వాతావరణాన్ని సృష్టించి అక్కడ రాజకీయంగా అలజడి సృష్టించి ప్రజలందరి చూపును తమ వైపు తిప్పుకోవాలన్న వ్యూహంతో ముందుకు సాగుతారు.ఈ వ్యూహం ఫలించకపోతే అక్కడ మతపరమైన వ్యాఖ్యలు వివాదాస్పద నిర్ణయాలతో ప్రభుత్వం ఆగ్రహానికి గురవుతారు.

గురవడమే కాక ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాజకీయంగా సానుభూతి పొందాలనే ఆలోచనతో బీజేపీ వ్యవహరిస్తోన్న పరిస్థితి ఉంది.

అయితే వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న బీజేపీ, తమ తరహా రాజకీయ వ్యూహం తెలంగాణలో ఫలిస్తుందా లేదా అని చిన్న చిన్న ఘటనలతో ఒక అవగాహనకు వస్తున్న పరిస్థితి ఉంది.అందుకు ప్రత్యక్ష ఉదాహరణ హైదరాబాద్ మరియు నిజామాబాద్ పేరు మార్పు అంశం.అయితే కేసీఆర్ రాజకీయ అపర చాణక్యుడైన కెసీఆర్ ముందు బీజేపీ తరహా రాజకీయం ఏ మేరకు నిలబడుతుందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube