టాలీవుడ్ మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసినా ‘బేబీ’ ( baby )సినిమా మేనియా నే కనిపిస్తుంది.చాలా చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం విడుదలైన తర్వాత అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చింది.
రీసెంట్ సమయం లో స్టార్ హీరోల సినిమాలు కూడా చెయ్యని అద్భుతాలు ఈ చిత్రం చేస్తుంది.వాటిని చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
కేవలం వీకెండ్స్ తో వచ్చే జనాలతో నడిచే మన తెలుగు సినిమా థియేటర్స్ వీకెండ్ తర్వాత, వర్కింగ్ డేస్ లో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకోవడం అనేది ఇప్పుడే మనం చూస్తున్నాము.మొదటి రోజు వసూళ్లు ఎంత అయితే ఉండేవో, 5 వ రోజు వసూళ్లు కూడా అంతకు మించి ఉన్నాయి.
ఇది నిజంగా ఆ చిత్ర మేకర్స్ కలలో కూడా ఊహించి ఉండరు.నేడు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు వచ్చినప్పటికీ కూడా ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది అంటే సాధారణమైన విషయం కాదు.

ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి నిర్మాత SKN అలియాస్ శ్రీనివాస్ కుమార్( Srinivas Kumar ).ఈయన ఒక మెగా ఫ్యాన్ గా సోషల్ మీడియా మొత్తం ఎప్పటి నుండే సుపరిచితుడే.అంతే కాదు టాలీవుడ్ లో మెగా హీరోలైన పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ వంటి హీరోల సినిమాలకు పీఆర్వో( PRO ) గా కూడా పని చేసాడు.ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఈయన శాశ్వత పీఆర్వో అనే విషయం సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే ప్రతీ ఒక్కరికి తెలుసు.
ఈయనకి సోషల్ మీడియా లో మొదటి నుండి ఉన్న నెగటివిటీ మామూలుది కాదు.ఎందుకంటే మెగా ఫ్యామిలీ కాబట్టే.ఇండస్ట్రీ లో మెగా ఫ్యామిలీ అయినా, నందమూరి ఫ్యామిలీ అయినా లేదా ఘట్టమనేని ఫ్యామిలీ అయినా నెగటివిటీ ఎదురుకోక తప్పదు.ఎందుకంటే వాళ్ళని ప్రేమించే వాళ్ళు ఎంత మంది ఉంటారో, ద్వేషించే వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు.

ఇది ఇలా అలా పక్కన పెడితే SKN కి సోషల్ మీడియా లో పలు వెబ్ సైట్స్ ఉన్నాయని, వాటిని మ్యానేజ్ చేస్తూ మెగా ఫ్యామిలీ( Mega Family ) హీరోలకు ఎక్కువ కలెక్షన్స్ వేసి, మిగిలిన హీరోల సినిమాలకు తక్కువ వేస్తాడని, అలా పెద్ద మాఫియా నే నడుపుతున్నాడని, ఇలా ఎన్నో రకాల ట్రోల్ల్స్ ని ఎదురుకున్నాడు.ఆ ట్రోల్ల్స్ కి ఆయన చాలా దీటుగా సమాదానాలు కూడా చెప్పేవాడు.అలాంటి స్థాయి నుండి నేడు సినీ నిర్మాతగా ఎదిగి సక్సెస్ లు అందుకొని ఒక నిర్మాతగా స్థిరపడిపోయారు.అంతే కాకుండా సోషల్ మీడియా లో ఆపదలో ఉన్న ప్రతీ ఒక్కరికీ సహాయం చేస్తూ వస్తున్నాడు.
ఈమధ్యనే ఆయన ఒక చిన్నారిని బ్రతికించడం కోసం 7 లక్షలు అవసరం అయితే, తన వంతుగా ప్రచారం చేస్తూనే, లక్ష రూపాయిలు డొనేషన్ ఇచ్చాడు.అలా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇది వరకు ఆయన చేసి ఉన్నాడు.
కెరీర్ లో రెండు సక్సెస్ లను అందుకొని మంచి ఊపు మీదున్న ఈ నిర్మాత రాబొయ్యే రోజుల్లో పీక్ చూస్తాడో లేదో చూడాలి.