పెద్దిరెడ్డి దెబ్బ‌కు వైసీపీలో మ‌రో మంత్రి ఎస్కేప్ అయ్యారా ?

ఆయ‌న స్క్రిప్టు రెడీ చేసుకున్నారు.మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి క‌న్నా ఎక్కువ మార్కులు సంపాయించుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు.

 Did Another Minister Bothsa Satyanarayana In The Ycp Escape The Blow Of Peddired-TeluguStop.com

ఇక‌, ప్రెస్ మీట్ పెట్టి.రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్‌ను క‌డిగిపారేయాల‌నుకున్నారు.

రాష్ట్రంలో జ‌రుగుతున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో నిష్ప‌క్ష‌పాతం లేకుండా ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌న్న నిమ్మ‌గ‌డ్డ‌.ఏక‌ప‌క్షంగా టీడీపీ ద‌న్నుగా నిలుస్తున్నారంటూ.

నిప్పులు చెర‌గాల‌ని కూడా ప్లాన్ చేసుకున్నారు.దీనికి సంబంధించిన పూర్తి స‌మ‌చారం కూడా సేక‌రించారు.

ఆయ‌నే మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌.త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డి.అటు నిమ్మ‌గడ్డ‌ను.ఇటు చంద్ర‌బాబును ఏకేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

కానీ, ఒక్క‌సారిగా మంత్రి బొత్స దూకుడుకు బ్రేకులు ప‌డ్డాయి.మీడియా ముందుకు రావాల‌ని అనుకుని.

ప‌క్కాగా స‌మాచారం కూడా సేక‌రించి.గ‌ణాంకాల‌తో స‌హా తొలి ద‌శ పంచాయ‌తీ ఎన్నిక‌ల విష‌యంలో గ‌ళం విప్పాల‌ని అనుకున్న ఆయ‌న వెన‌క్కి త‌గ్గారు.

మ‌రి ఎందుకు?  అలా ఎందుకు మంత్రి వెన‌క్కి త‌గ్గారు? ఇదే ఇప్పుడు వైసీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో దూకుడుగా వ్య‌వ‌హ‌రించి.

అటు కోర్టుల‌పైనా.ఇటు చంద్ర‌బాబుపైనా కూడా నింద‌లు వేసి.

మీడియా ముందుకు వ్యాఖ్య‌లు చేసిన బొత్స‌.అప్ప‌ట్లో సోష‌ల్ మీడియా నుంచి ఎదురైన విమ‌ర్శ‌ల‌ను కూడా లెక్క చేయ‌ని విష‌యం తెలిసిందే.

Telugu Ap, Complaint, Latest, Ministers, Panchayat, Peddi, Ysrcp-Telugu Politica

దీంతో అదే త‌ర‌హాలో నిమ్మ‌గ‌డ్డ‌పైనా కొన్నాళ్లుగా ఆయ‌న రెచ్చిపోతున్నారు.ఈ క్ర‌మంలో మ‌రింత దూకుడు పెంచి.అప్ప‌టికే నిమ్మ‌గ‌డ్డ‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న‌వారి కంటే.ఎక్కువ‌గా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాలని అనుకున్నారు.అయితే.అనూహ్యంగా ఆయ‌న వెనక్కిత‌గ్గ‌డం వెనుక‌.

మరో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డే ఉన్నార‌ని అంటున్నారు వైసీపీ సీనియ‌ర్లు గుస‌గుస‌గా! అదేంటి అంటున్నారా.ఇక్క‌డే ఉంది.

ఇప్ప‌టికే ఈ ఇద్ద‌రు మంత్రుల‌పై నిమ్మ‌గ‌డ్డ ఆగ్ర‌హంతో ఉన్నారు.గ‌వ‌ర్న‌ర్‌కు సైతం ఫిర్యాదు చేశారు.

అయినా.వీరు కూడా అదేస‌మ‌యంలో నిమ్మ‌గ‌డ్డ‌పై ప్రివిలేజ్ క‌మిటీకి ఫిర్యాదు చేశారు.ఈ ప‌రిణామాలు ఇలా ఉన్న నేప‌థ్యంలోనే పెద్దిరెడ్డి నిమ్మ‌గడ్డ‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.దీంతో ఆయ‌న‌కు ఎస్ ఈసీ నుంచి చేదు అనుభ‌వం ఎదురైంది.

ఈ ప‌రిణామం గ‌మ‌నించిన బొత్స‌.వెన‌క్కి త‌గ్గార‌ని.

ఎస్ ఈసీతో ఇప్పుడు వ‌ద్దులే.ఎన్నిక‌ల‌య్యాక చూసుకుందామ‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లో జోరు చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఇదీ.సంగ‌తి!!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube