మొదటి పాన్ ఇండియా హీరో అవ్వాల్సిన రామ్ చరణ్ ని తొక్కేసింది అల్లు అరవిందేనా.. అంత పగ ఎందుకు..?

మన ఇండియాలో మొదటి పాన్ ఇండియా స్టార్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్ మాత్రమే.కానీ ప్రభాస్ ( Prabhas ) కంటే ముందే రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అయ్యేవారట.

 Did Allu Aravind Trample Ram Charan Who Was Supposed To Be The First Pan India H-TeluguStop.com

కానీ ఆయనను పాన్ ఇండియా స్టార్ అవ్వకుండా ఆయన మేనమామ అల్లు అరవింద్ తొక్కేసారని గతంలో ఒక వార్త వినిపించింది.అదే వార్త తాజాగా మరోసారి తెర మీద వైరల్ అవుతుంది.

అసలు విషయంలోకి వెళ్తే.రామ్ చరణ్ (Ram charan) రెండో సినిమానే స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో చేశారు.

అదే మగధీర( Magadheera ) .ఈ సినిమా విడుదలై 14 సంవత్సరాల పూర్తయింది.ఇక ఈ సినిమా ద్వారా డైరెక్టర్, హీరో,హీరోయిన్ ఇలా అందరికీ మంచి గుర్తింపు లభించింది.

అంతేకాకుండా ఈ సినిమా తర్వాత చాలామంది కాలభైరవ మిత్రవింద క్యారెక్టర్లకి ఆకర్షితులయ్యారు.ఈ సినిమా షూటింగ్ టైంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు కూడా నెలకొన్నాయి.ఆసక్తికర విషయాలు పక్కన పెడితే.

ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అయ్యేవారట.అవును మీరు వినేది నిజమే.

ఈ సినిమా తీసే టైమ్ లో కొద్దిమేర షూటింగ్ అయిపోయాక రాజమౌళి( Rajamouli ) సినిమా ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేద్దాం అని అన్నారట.అయితే ఈ సినిమాని అల్లు అరవింద్ నిర్మించారు.

ఈ సినిమాకి పెట్టే కంటే మరి కొంత బడ్జెట్ ఎక్కువగా పెడితే కచ్చితంగా ప్లాన్ ఇండియా లెవెల్లో సినిమా హిట్ కొడుతుంది అని రాజమౌళి తన అభిప్రాయాన్ని అల్లు అరవింద్ (Allu aravind) దగ్గర చెబితే అల్లు అరవింద్ మాత్రం ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తే ఎవరూ చూడరు అనవసరంగా బడ్జెట్ బొక్కా అని రాజమౌళికి చెప్పారట.

కానీ సినిమా విడుదలయ్యాక సంచలనం సృష్టించి ఎన్నో రికార్డులను చెరిపేసింది.దాంతో రాజమౌళి కి అల్లు అరవింద్ పై కోపం వచ్చిందట.అంతేకాదు సినిమా వల్ల నాకు డైరెక్టర్ గా పేరు కూడా వచ్చేది కానీ అల్లు అరవింద్ వల్లే ఈ పేరు పోయింది అని భావించాడట.

అందుకే వీరి మధ్య మాటలు లేవు అని కూడా ప్రతిసారి నెట్టింట్లో వార్తలు వినిపిస్తూ ఉంటాయి.అలాగే రామ్ చరణ్( Ram charan ) మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తే తన కొడుకు అల్లు అర్జున్ కంటే రామ్ చరణ్ ఎక్కడ స్టార్ హీరో అవుతాడో అనే ఉద్దేశంతోనే అల్లు అరవింద్ ఇలా చేశారని గతంలో వార్తలు వినిపించాయి.

ఏది ఏమైనప్పటికీ ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు మాత్రం అల్లు అరవింద్ వల్లే మొదటి పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ కాలేకపోయారని ఇప్పటికీ బాధపడుతూ ఉంటారు.

Reason for Ram Charan Magadheera Not Released Pan India

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube