పెళ్లిలో అతియా దరించిన లెహంగా తయారీ కోసం అన్ని వేల గంటలు కష్టపడ్డారా?

బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి గురించి మనకు తెలిసిందే.ఈమె ప్రముఖ ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.

 Did All The Thousands Of Hours Go Into Making The Lehenga That Athiya Wore At Th-TeluguStop.com

ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట గత రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.

వీరి వివాహం ముంబైలోని సునీల్ శెట్టి ఫామ్ హౌస్ ఖండాలాలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

ఇక వీరి పెళ్లి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.పెళ్లి దుస్తులలో అతియా కేఎల్ రాహుల్ చూడముచ్చటగా ఉన్నారు.ముఖ్యంగా అతియా పెళ్లిలో ధరించిన లెహంగా మాత్రం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.

Telugu Athia Kal Rahul, Athiyashetty, Anamika Khanna, Kl Rahul, Lehenga, Suneel

ఎంతో ఆకర్షణీయంగా ఉన్నటువంటి ఈ లేహంగాను అతియా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనామిక ఖన్నాతో డిజైన్ చేయించారని తెలుస్తోంది.అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఫ్యాషన్ డిజైనర్ అనామిక ఈ లెహంగా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.పెళ్లిలో అతియా ధరించిన ఈ లెహంగా కోసం డిజైనర్లు చాలా కష్టపడ్డారని అనామిక తెలిపారు.

Telugu Athia Kal Rahul, Athiyashetty, Anamika Khanna, Kl Rahul, Lehenga, Suneel

లెహంగా తయారీకి సుమారు 416 రోజుల సమయం పట్టిందని ఈమె ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.ఈ లెహంగా పూర్తిగా చేతితోనే డిజైన్ చేసినదని,ఈ లెహంగాను జర్దోజీ, జాలీ వర్క్ పట్టుతో రూపొందించినట్లు వివరించారు. ఇలా ఈ లెహంగా కోసం 416 రోజులు అంటే దాదాపు పదివేల గంటలు పాటు డిజైనర్లు కష్టపడి ఈ లెహంగాను రూపొందించారంటూ డిజైనర్ అనామిక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేయడంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube