ఎన్టీఆర్‌ మీద గెలిచిన బాలకృష్ణ

ఏ ఏరియాలో ఎలా ఆడినా, సీడెడ్ మాత్రం నందమూరి కంచుకోట.చిరంజీవి నెం.1 గా ఇండస్ట్రీని ఏలిన రోజుల్లో కూడా, బాలయ్య బాబు సీడెడ్ లో మొదటిస్థానంలో నిలిచాడు.మాహేష్, పవన్ ఏలుతున్న ఈ సమయంలో కూడా ఎన్టీఆర్ వారిద్దరికి మించి సీడెడ్లో సత్తా చాటుతున్నాడు.

 Dictator To Have Bigger Release In Ceded Than Nannaku Prematho-TeluguStop.com

కారణాలు ఏవైనా, ఆ ఏరియా నందమూరి వారిదే.

మరి అటు బాలకృష్ణ, ఇటు జూనియర్ ఎన్టీఆర్‌ ఒకేసారి తలపడితే? సీడెడ్ రారాజులు ఇద్దరు ఒకేసారి కదనరంగంలోకి దిగితే? విజయం ఎవరిది? కలెక్షన్లు ఎవరికి ఎక్కవ వస్తాయి అనేది పక్కనపెడితే థియేటర్లు మాత్రం బాలయ్య బాబు వైపే మొగ్గుచూపుతున్నాయి.అవును నాన్నకు ప్రేమతో సీడెడ్ లో డిక్టేటర్ కన్నా ఎక్కువ థియేటర్లు సంపాదింలేకపోతోంది.8.5 కోట్లతో మొదలుపెట్టి, ఆ తరువాత ఎన్టీఆర్‌ సినిమాను 7.2 కోట్లకే కొనడం మరో విడ్డూరం.ఇక డిక్టేటర్, నాన్నకు ప్రేమతో విడుదల అయ్యాక సీడెడ్ జనాలు నందమూరి అందగాళ్ళలో ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తారో చూడాలి.

నాన్నకు ప్రేమతో ఈ నెల 13న, డిక్టేటర్ ఈ నెల 14న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube