అమెరికా లో బాలకృష్ణ కష్టాలు !!

సెన్సారేం ఖర్మ సినిమా షూటింగ్ మొదలవగానే డిస్ట్రిబ్యూటర్ లు ఎగబడి మరీ ఓవర్ సీస్ హక్కులు కోనేస్తున్న రోజులు ఇవి, కానీ బాలకృష్ణ సినిమాకి అక్కడ యూ ఎస్ లో మార్కెట్ లేదు అనుకున్నారో కోనా వెంకట్ వరస ప్లాపులు ఇస్తున్నాడు కాబట్టి అగారో కానీ డిక్టేటర్ సినిమా అమ్మకాల దగ్గర చాలా తలనొప్పి షురూ అయ్యింది.ఓవర్ సీస్ మార్కెట్ దారుణంగా పడిపోయింది.

 Dictator Problems In Us-TeluguStop.com

సెన్సార్ పూర్తియయిన తరవాత కూడా ఈ సినిమాకి అసలు అమ్మకానికి ఏమీ రాలేదు ఆఖరికి నిన్న అర్ధరాత్రి సమయం తరవాత కాస్త తేరుకుంది సినిమా.అన్ని సెంటర్లతో పాటు ఓవర్సీస్ లో కూడా సత్తా చాటాలని చూస్తున బాలకృష్ణ యూఎస్ మార్కెట్ ని బాగా సీరియస్ గా తీసుకున్నారు.

ఒక పక్క ఎన్టీఆర్ సినిమా అక్కడ రికార్డు స్థాయిలో విడుదల అవుతుంటే బాలయ్య సినిమా ని కొనడానికి బయ్యర్లు కూడా దొరకలేదు పాపం.

ఈ విషయమై యుఎస్ లో చాలా మల్లగుల్లాలు పడ్డట్టు వినికిడి.

ఇక్కడ తెలుగుదేశం అధికారంలో వుంది.అలాంటపుడు ఓవర్ సీస్ లో బాలయ్య సినిమా విడుదల కాకుంటే, రేపు అక్కడ తెలుగుదేశం అభిమానులమనో, బాలయ్య ఫ్యాన్స్ అనో చెప్పుకునేవారు ఇక్కడికి వస్తే నామోషిగా వుంటుంది.

అందుకే ఆఖరికి ఓ చిన్న బయ్యర్, కొంతమంది ఫ్యాన్స్ కలిసి డిక్టేటర్ ను ఓవర్ సీస్ లో పంపిణీకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ముప్పై లేదా నలభై లక్షల మేరకు హక్కులు అమ్ముడయ్యాయి అని తెలుస్తోంది కానీ సినిమా జనాలు మాత్రం ఎనభై కి అమ్ముడయింది అంటున్నారు.

ఇక్కడ మార్కెట్ లెక్కలు దాగుతాయి కానీ ఓవర్ సీస్ లెక్కలు దాగవు.అదే సమస్య.

మరి థియేటర్లు ఎన్ని వేస్తారో, కలెక్షన్లు ఎలా వుంటాయో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube