బొగ్గు గనిలో వజ్రాలు..?! రంగంలోకి దిగిన ప్రభుత్వం..!  

తాజాగా సోషల్ మీడియాలో నాగాలాండ్ రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనుల్లో వజ్రాలు బయటపడినట్లు వార్తలు పెద్దఎత్తున వైరల్ గా మారాయి.నాగాలాండ్ రాష్ట్రంలోని మోన్ జిల్లా కేంద్రానికి దగ్గర్లో ఉన్న మారుమూల గ్రామంలో వాంచింగ్ లో ఉన్న బొగ్గుగనిలో తవ్వకాలు చేస్తుండగా 2 రోజుల క్రితం విలువైన ఖనిజాలు బయటపడినట్లు సమాచారం.

TeluguStop.com - Diamonds In Coal Mine Government Enters The Field

అలా బయట పడిన ఖనిజాలు మెరుస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో వాటికీ సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు షేర్ అయ్యాయి.తాజాగా ఈ విషయంపై నాగాలాండ్ ప్రభుత్వం అధికారులకు అక్కడ దొరికింది వజ్రాల లేదా అన్న విషయాన్ని దర్యాప్తు చేసి ధ్రువీకరించాలని అని ఆదేశించారు.

ఇదివరకే నాగాలాండ్ రాష్ట్రంలో వజ్రాలు దొరికే అవకాశం ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో తేలింది.రాష్ట్రంలోని వాచింగ్ గనుల వద్ద ఎంతో నాణ్యమైన బొగ్గు టన్నుల కొద్దీ లభిస్తుంది.

TeluguStop.com - బొగ్గు గనిలో వజ్రాలు.. రంగంలోకి దిగిన ప్రభుత్వం..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇందులో భాగంగా బొగ్గు తవ్వకాలలో గ్రామస్తులకి తెల్లగా మెరిసే విధంగా, అచ్చం వజ్రంలా కనిపించిన రాళ్ళు వారికి లభించాయి.దీంతో ఆ వార్త కాస్త చుట్టుపక్కల తెలియడంతో వజ్రాల వేట కోసం అమాంతం అక్కడికి చేరుకొని తెగ వెతుకులాట మొదలు పెట్టేశారు.

కేవలం ఆ గ్రామంలో మాత్రమే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా తవ్వకాలు మొదలు పెట్టినట్టు అధికారులు తెలియజేశారు.

అయితే వారికి దొరికినవి స్వచ్ఛమైన వజ్రాల లేకపోతే క్వార్టర్జ్ శిలలా అన్న సందేహం మాత్రం అధికారుల్లో నెలకొని ఉంది.

అచ్చం వజ్రాలు లాగా ఉన్న నాలుగు రాళ్లు లభించడంతో అక్కడి గ్రామస్తులు మొదటిగా ఆశ్చర్యపోయారని, ఆ తర్వాత ఇంకా దొరుకుతాయన్న నేపథ్యంలో మరికొందరు తవ్వకాలు మొదలు పెట్టారని జిల్లా కలెక్టర్ తెలియజేశారు.అయితే ఇందులో భాగంగానే అవి భూమి ఉపరితలం పైన లభించడంతో అవి వజ్రాలు కూడా అయి ఉండొచ్చని వారు తెలిపారు.

ఈ విషయం సంబంధించి రాబోయే రోజుల్లో భూగర్భ గనుల శాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడ ఉన్న ఖనిజాల పై పరిశోధన జరుపుతారని కలెక్టర్ తెలిపారు.అయితే, సదరు గ్రామ సర్పంచ్ స్పందిస్తూ అవి వజ్రాలు అయి ఉండకపోవచ్చని ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు.

ఇందుకు కారణం ఆ గ్రామస్థుడుకి దొరికిన రాళ్లను సుత్తితో పగలగొట్టడం ద్వారా అవి ముక్కలు అయ్యాయని అతడు తెలియజేశారు.

#Government #Scientists #Diamond #Coal Mining

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు