గ్రహాలపై వజ్రాల వర్షం కురిసిందట.. తీసుకోవడానికి వెళదామా?

మనం నివసించే భూగ్రహంపై వర్షం ఏ రూపంలో పడుతుందో ఎపుడైనా ఆలోచించారా? ఇపుడు తెలుసుకోండి.భూమిమీద పడే వర్షపు నీరు హైడ్రోజన్, ఆక్సిజన్ సమ్మేళనంతో కూడుకున్నది.

 Diamonds Have Rained On The Planets Shall We Go Get Them , Viral Latest, News V-TeluguStop.com

అలాగే ఇతర గ్రహాలపైన కూడా వర్షం పడుతుంది.అయితే ఇక్కడ పడే వర్షపు నీటి బిందువులు భారీ సైజులో, మందంగా ఉండటంతో పాటు నీటికి బదులు కార్బన్‌ సమ్మేళనం మిశ్రమాన్ని కలిగి ఉంటాయి.

పైగా ఈ గ్రహాలపై ఉష్ణోగ్రత, పీడన పరిస్థితుల కారణంగా ఆయా వాతావరణాల్లో వర్షం కురుస్తున్నప్పుడు కార్బన్ అణువులు వజ్రాలుగా చూర్ణం చేయబడతాయి.ఆ గ్రహాలే భూమికి దగ్గరగా మన సౌర వ్యవస్థలో ఉన్నటువంటి ‘యురేనస్, నెప్ట్యూన్’.

యురేనస్, నెప్ట్యూన్ ఒకే విధంగా కనిపించినప్పటికీ లక్షణాలు మాత్రం పూర్తి విభిన్నంగా ఉంటాయి.ఈ గ్రహాలపై ఇలాంటి ప్రత్యేక స్థితికి నీలి రంగే ప్రధాన కారణం అని ఎంతమందికి తెలుసు? మీథేన్ ఫలితంగానే ఇవి ఈ రంగులో మనకు కనిపిస్తాయి.మీథేన్.పొగమంచు కణాలపై చాలా వేగంగా ఘనీభవించడం వల్ల ఈ పొర బేస్ వద్ద ‘మంచు’గా మారుతుంది.

ఉష్ణోగ్రతల స్థాయిలు పడిపోయినపుడు ఇక్కడ ఆవిరైపోయిన మీథేన్ ప్రధాన పొగమంచు కణాలను విడుదల చేస్తుంది.కాగా మీథేన్‌లో కార్బన్ ఉంటుందని, ఏ ప్రమేయం లేకుండా స్వయంగా ఏర్పడే ఈ కార్బన్ అపారమైన ఒత్తిళ్ల వల్ల నలిగిపోతుందని నవోమీ గర్నీ అనే ఖగోళ భౌతిక శాస్త్రవేత్త వెల్లడించారు.

ఇక గ్రహం లోపల వేడి, సాంద్రత దట్టంగా ఉన్నప్పుడు పడే వర్షపు నీటి బిందువులు వజ్రాలుగా ఏర్పడి పేరుకుపోతాయి.ఆపై మరింత భారీగా మారి, అవే వాతావరణంలో వర్షంగా కురుస్తాయని అతను వ్యాఖ్యానించారు.ఇక్కడ నెప్ట్యూన్ స్పష్టంగా నీలి రంగు కలిగి ఉండగా.యురేనస్ లేత నీలం రంగులో ఉంటుంది.

ఈ రెండు గ్రహాల్లోని తీవ్ర పరిస్థితులు వల్ల కార్బన్ పరమాణువులు గట్టిపడి వజ్రాలుగా ఏర్పడతాయి.అయితే దురదృష్టవశాత్తు, ఈ వజ్రాలను సేకరించడానికి ఆ గ్రహాలపైకి ఎవరూ వెళ్లే సాహసం చేయలేరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube