ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు కి కేరాఫ్ అడ్రస్ గా రాయలసీమ ప్రాంతం అని చాలా మంది అంటుంటారు.సరైన వర్షపాతం లేకపోవటంతో పాటు పొలాలలో ఎంత లోనకి బోర్లు వేసిన నీళ్లు రాని పరిస్థితి ఏర్పడటంతో చాలా వరకు అక్కడ బీడు భూములు ఉంటాయని చెబుతుంటారు.
ఇలాంటి రాయలసీమ ప్రాంతంలో ఓ జిల్లాలో జనాలు వజ్రాల వేటకు తండోపతండాలుగా పంట భూములలో వెతుకులాట స్టార్ట్ చేశారు.ఆ జిల్లా ఏదనగా కర్నూల్.
తాజాగా కర్నూలు ప్రాంతానికి చెందిన ప్రజలు డైమండ్ హంటింగ్ స్టార్ట్ చేశారు.మూడు రోజుల వ్యవధిలో మూడు వజ్రాలు లభ్యం కావడంత . జనాలు భారీగా వెతుకులాట స్టార్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే తుగ్గలి మండలం జొన్నగిరి లో వజ్రాలు లభ్యమవుతున్నాయి.
70 వేలకు అదేవిధంగా 40 వేలకు రెండు వజ్రాలను ఇటీవల వ్యాపారులు కొనుగోలు చేయడం జరిగింది. 2 రోజుల క్రితం ఓ రైతుకి దొరికిన వజ్రాన్ని కోటి 25 లక్షలకు ఓ వ్యాపారికి అమ్మడం జరిగింది.
అయితే ఇది బహిరంగ మార్కెట్లో దాదాపు మూడు కోట్ల విలువ చేస్తుందని మిగతా వ్యాపారులు చెబుతున్నారు.దీంతో మూడు రోజుల వ్యవధిలో మూడు వజ్రాలు దొరకటం కర్నూలు జిల్లాలో చర్చనీయాంశమైంది.
ఎవరికి వారు వజ్రాల వేట స్టార్ట్ చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ఓవర్ నైట్ లో కోటీశ్వరులు అయిపోవాలని ట్రై చేస్తున్నారు.