తెలంగాణలో వజ్రాల గని ఉంది అంటున్న పరిశోధకులు! అసలు విషయం ఏంటంటే

తెలంగాణకి మణిహారంగా ఇప్పటికే సింగరేణి మైనింగ్ నిక్షేపాలు ఉన్నాయి.వీటి నుంచి కోట్ల రూపాయిలు ఆదాయం తెలంగాణ ప్రభుత్వానికి వస్తుంది.

 Diamond Mines In Fields Of Krishna River Basin-TeluguStop.com

ఇక దశాబ్దాలుగా సింగరేణి మైనింగ్ తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి.ఇప్పటికే లక్షల టన్నుల నిక్షేపాలు అందులో ఉన్నాయి.

ఇదిలా ఉంటే కేవలం మాంగనీస్ మైనింగ్ నిక్షేపాలే కాకుండా తెలంగాణలో వజ్రాల గనులు కూడా ఉన్నాయని ఉస్మానియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు.అనేక పరిశోధనలు చేసిన తర్వాత ఈ విషయాన్ని ద్రువీకరిస్తున్నట్లు వారు చెప్పుకొచ్చారు.

కృష్ణమ్మ పరుగుల కింద మిళ మిళ మెరిసే వజ్రాల గనుల నిక్షేపాలు ఉన్నట్లు తమ పరిశోధనల్లో గుర్తించినట్టు జియోలాజికల్‌ శాస్త్రవేత్తలు తాజాగా తెలియజేసారు.అలాగే నల్లమల అడవుల్లో అపార ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా తాజా పరిశోధనల్లో తేలినట్లు తెలియజేసారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా లింగాల్‌ మండలాన్ని ఆనుకొని ఉండే నల్లమల అటవీ ప్రాంతం పరిధిలో ఇనుప ఖనిజంతో పాటు లోపలి పొరల్లో వజ్రాలు, బంగారు నిక్షేపాలు ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని జీఎస్ఐ ఇటీవల నివేదిక సమర్పించింది.నల్లమల అడవులలో ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని దశాబ్దాల క్రితమే చాలా అంతర్జాతీయ సంస్థలు తెలియజేసాయి.

అయితే అక్కడ తవ్వకాలు జరిగితే పర్యావరణంకి పెను ప్రమాదం సంభవిస్తుంది అని భావించి వాటి జోలికి వెళ్ళలేదు.నల్గొండ జిల్లాలోని రామడుగు, సోమవారిగూడెం, వట్టికోడు, యాచారం ప్రాంతాల్లో, మహబూబ్‌నగర్‌ జిల్లాలో వజ్రాల గనులు ఉండే అవకాశాలు ఉన్నట్లు పరిశోధనలో గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube