19 జిల్లాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లు.. సీఎం కేసీఆర్ ఆదేశం..!

తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు.రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్ లో 19 వైద్య పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సిఎం కే.

 Diagnostic Centers In Government Hospitals Cm Kcr Orders From June 7, Blood Test-TeluguStop.com

సి.ఆర్ నిర్ణయించారు.జూన్ 7 నుండి ఇవి ప్రారంభించాలని సిఎం కే.సి.ఆర్ ఆదేశించారు.రాష్ట్రంలో 19 జిల్లా కేంద్రాల్లో వైద్య పరీక్షా కేంద్రా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని వైధ్య అధికారులు సిఎం దృష్టికి తీసుకు వచ్చారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో పరీక్షా కేంద్రాలను సోమవారం నుండి ప్రారంభించాలని సిఎం వైద్యాధికారులను ఆదేశించారు.

తెలంగాణ ప్రజలకు మంచి వైద్యం అందించాలని.అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.కరోనా వంటి వ్యాధుల సమయంలో రాష్ట్రంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు సహా ఇతర ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా మౌలిక వసతులను మెరుగుపరచాలని కే.సి.ఆర్ అన్నారు.ప్రభుత్వ వైద్యాన్ని సామాన్య ప్రజలకు మరింత అందుబాటులో ఉంచేలా ఆరోగ్య తెలంగాణాను తీర్చి దిద్దే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని అన్నారు.వైద్యంలో అత్యంత కీలకమైన డయాగ్నస్టిక్ సెంటర్స్ ఏర్పాటు చేయడం రాష్ట్ర వైద్య చరిత్రలో గొప్ప సనర్భమని కే.సి.ఆర్ అన్నారు.ఈ డయాగ్నస్టిక్ కేంద్రాల్లో 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని.కరోనా పరీక్షతో పాటుగా బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ సహా బీపీ, షుగర్, గుండె జబ్బులు, లివర్, కిడ్నీ, థైరాయిడ్, ఎక్స్ రే, బయోకెమిస్ట్రీ, పాథాలజీ సంబంధించిన పరీషలు ఉంటాయని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube