డయాబెటిస్ ని తరిమికొట్టే సూప్.. ఏదో తెలుసా?

డయాబెటిస్ దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేదు.ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల దాదాపు ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో డయాబెటిస్ తో బాధపడేవారు ఉన్నారు.

 Shake And Soup For Diabetes, Diabetes, Shake And Soup, Us Scientists, Diet Plan,-TeluguStop.com

ఈ వ్యాధి రావడానికి ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేకపోయినా, కొందరిలో వంశపారంపర్యంగా ఈ వ్యాధితో బాధపడుతూ ఉంటారు.ఈ వ్యాధిమరింత తీవ్రతరం కాకుండా, అదుపులో ఉంచుకోవడానికి ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

అంతేకాకుండా డయాబెటిస్ మనకి రాకుండా, ఒకవేళ డయాబెటిస్ తో బాధపడేవారు ఈ సూప్ తాగడం వల్ల డయాబెటిస్ నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చనీ చెబుతున్నారు.

డయాబెటిస్ తో బాధపడేవారు వారి ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొలెస్ట్రాల్ తక్కువ పరిమాణంలో ఉండి, ఫైబర్ లో అధికంగా ఉండేలా చూసుకోవాలి.

అన్నం తక్కువగా తీసుకొని, వాటి స్థానంలో రొట్టెలు, చపాతీ వంటివి తినడం ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు.ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఒక గంట సమయం పాటు వ్యాయామం చేయాలి.

అధిక బరువు సమస్యతో బాధపడేవారిలో డయాబెటిస్ మరింత ప్రమాదకారి కావచ్చు.కాబట్టి వీలైనంత వరకు మన బరువును కూడా అదుపులో ఉంచుకోవాలి.

జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిని పూర్తిగా మానుకోవడం ఎంతో శ్రేయస్కరం.

యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ వారి పరిశోధనలో భాగంగా, డయాబెటిస్ తో బాధపడే వారికి సూప్-ఎండ్-షేక్ ఇవ్వడం ద్వారా వారిలో డయాబెటిస్ తీవ్రత చాలా వరకు తగ్గిందని పరిశోధనల్లో తేలింది.

ఈ సూప్ అండ్ షేక్ వెయిట్ లాస్ ప్లాన్ త్వరలో ప్రపంచమంతా విస్తరింపజేసి డయాబెటిస్ తీవ్రతను తగ్గించాలని పరిశోధకులు భావిస్తున్నారు.డయాబెటిస్ తీవ్రతను తగ్గించకపోతే, ఇది మరిన్ని సమస్యలకు దారితీస్తుంది.

సరైన డైట్ ను ఫాలో అవుతూ, ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా డయాబెటిస్ నుంచి విముక్తి పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube