మధుమేహం ఉన్నవారు ఆహారాన్ని ఏ విధంగా తీసుకోవాలో తెలుసా     2018-08-09   10:32:07  IST  Laxmi P

మధుమేహం ఉన్నవారు ఆహారాన్ని తీసుకొనే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రెండు భోజనాలకు మధ్య విరామం ఎక్కువగా ఉండకూడదు. ఒకవేళ ఎక్కువగా ఉంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోతాయి. అందువల్ల వారు తీసుకొనే ఆహారాన్ని మూడు సార్లు అంటే ఉదయం,మధ్యాహ్నం,రాత్రి తీసుకొనే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఉదయం 11 గంటలకు,సాయంత్రం 5 గంటలకు స్నాక్స్ తీసుకోవాలి. మధుమేహం ఉన్న వారు అన్ని రకాల ఆహారాలను తీసుకోవచ్చు. అయితే త్వరగా జీర్ణం అయ్యే కార్బో హైడ్రేట్స్ ని తీసుకోకూడదు. ఎందుకంటే రక్తంలో తొందరగా షుగర్ లెవల్స్ పెరుగుతాయి.

Diabetic Patients Dietary Restrictions-

Diabetic Patients Dietary Restrictions

అలాగే షుగర్, స్వీట్లు, అరటిపండు, పండ్ల రసాలు,చాక్లెట్లు, ద్రాక్ష, కూల్ డ్రింక్, అన్నం వంటివి చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. మధుమేహమా ఉన్నవారికి ప్రొటీన్లు చాలా అవసరం. ప్రోటీన్స్ సమృద్ధిగా ఉండే గింజధాన్యాలు, బీన్స్, ఆకు కూరలు, కూరగాయలు, పాలు, పెరుగు, సోయా, పనీర్, క్రీమ్ వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

Diabetic Patients Dietary Restrictions-

ప్రతి రోజూ ఆహారంలో విటమిన్లు, మినరల్స్ వుండే ఆకు కూరలు, సలాడ్లు వంటివి చేర్చండి. పీచు అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటే రక్తంలో కొలస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అయితే కేలరీలు తక్కువగా ఉన్న ఆహారాలను ఎంచుకోవాలి. మధుమేహం ఉన్నవారు నల్ల ద్రాక్షను తినవచ్చు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.