ఈ చిట్కాలు పాటిస్తే మధుమేహం రమ్మన్నా రాదు ....అవి ఏమిటో తెలుసా  

Diabetes Natural Remedies In Telugu-

ఈ మధ్య కాలంలో మధుమేహం బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఈ వ్యాధిని అదుపులో పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అదే అశ్రద్ద చేస్తే చాలా ప్రమాదకరంగా మారుతుంది...

ఈ చిట్కాలు పాటిస్తే మధుమేహం రమ్మన్నా రాదు ....అవి ఏమిటో తెలుసా-

మధుమేహం ఒక్కసారి వచ్చిందంటే జీవిత కాలం మందులు వాడవలసిందే. ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్లు, వయస్సు,అధిక బరువు,వారసత్వం వంటి కారణాలతో మధుమేహం వస్తుంది. మధుమేహం నియంత్రణలో ఆహారం ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

అందువల్ల ఇప్పుడు మధుమేహం ను కంట్రోల్ చేసే కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం.

మెంతులు

పురాతన కాలం నుండి మెంతులను మధుమేహం నివారణకు వాడుతున్నారు. ఇది చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.

పసుపు

పసుపులో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మధుమేహంను కంట్రోల్ లో ఉంచుతాయి. పసుపులో ఉండే కుర్కుమిన్ అనే కంటెంట్ యాంటీ డయాబెటిక్ గా పనిచేసి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్కలో ఫైటో న్యూట్రియంట్స్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. దాల్చిన చెక్క పొడిని ప్రతి రోజు టీలో వేసుకొని త్రాగితే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది,.