చెవిలో గువిలితో మధుమేహాన్ని గుర్తించొచ్చు.. ఎలాగో తెలుసా..?

ఈ కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మధుమేహ వ్యాధి అందరిని బాధిస్తుంది.షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవడానికి ప్రతిరోజు మందులు వేసుకోవడం, ఆహార నియమాలు పాటించడం, వ్యాయాయం ఇలా ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు.

 Diabetes, Detected, Hole , Ear, Sugar Diseases, Health Tips, University College-TeluguStop.com

అలాగే ఈ వ్యాధి తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవడానికి రక్త పరీక్షలు, యూరిన్ పరీక్షలు చేయించుకుంటూ ఉంటాము.ఈ వ్యాధి తీవ్రత తెలుసుకోవడానికి మన దగ్గర వేరే ప్రత్యామ్నాయం లేదు.

అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాన్నీ వింటే మీరే షాక్ అవుతారు.అది ఏంటంటే కేవలం రక్త పరీక్షలు, యూరిన్ పరీక్షల ద్వారానే కాకుండా చెవిలో ఏర్పడే గువిలి ద్వారా కూడా మధుమేహ వ్యాధిని గుర్తించవచ్చట.

 Diabetes, Detected, Hole , Ear, Sugar Diseases, Health Tips, University College-TeluguStop.com

అవును మీరు విన్నది నిజమే.లండన్ యూనివర్శిటీ కాలేజీ నిపుణులు చేసిన కొన్ని అధ్యయనాలలో భాగంగా చెవిలో ఏర్పడే గువిలి ద్వారా మధుమేహాన్ని గుర్తించవచ్చని తెలిపారు.

అది ఎలాగంటే మన చెవిలో ఉండే మైనం నుంచి గ్లూకోజ్ స్థాయిని తనిఖీ చేస్తే ప్రారంభదశలో ఏర్పడే మధుమేహాన్ని గుర్తించవచ్చని నిపుణులు తెలియజేశారు.ఈ అధ్యయనంలో భాగంగా ఈ పరీక్షలలో దాదాపు 60 శాతం వరకు కచ్చితమైన ఫలితాలను ఇస్తుంది.

అంతేకాకుండా మనం ఎక్కడికి వెళ్లకుండానే మన ఇంట్లోనే ఉండి మన చెవిలో ఉన్న గువిలి ద్వారా మధుమేహాన్ని చాలా సులభంగా గుర్తించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.

Telugu Diabetes, Tips, Hole, Sugar Diseases-General-Telugu

దీని కోసం ఒక అధునాతనమైన పరికరాలను కూడా ఏర్పాటు చేశారు.ఈ పరికరంను ఉపయోగించి మనం మధుమేహ పరీక్ష చేసుకోవచ్చని నిపుణులు తెలిపారు.ఈ పరీక్ష ద్వారా మన చెవిలో ఏర్పడే గువిలి ద్వారా మధుమేహాన్ని మొదటిదశలోనే గుర్తించడానికి వీలు ఉంటుంది.

ఇలా చెవిలో గువిలి ద్వారా ప్రారంభ దశలోనే మధుమేహాన్ని స్థాయిని తెలుసుకోవడం వలన సరైన సమయంలో వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చు అని భావిస్తున్నారు.ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని గుర్తించడం వల్ల శరీరానికి సరిపడా పౌష్టిక ఆహారాన్ని తీసుకొవడం, అలాగే శరీరానికి తగ్గ వ్యాయామాలు చేయటం ద్వారా షుగర్ వ్యాధి తీవ్రత మరింత పెరగకుండా కాపాడుకోవచ్చు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube