రెండో పెళ్ళి చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా.. ఎవరినో తెలుసా ?

బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా దాదాపు 30 సినిమాల్లో నటించి తన అందచందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.పెళ్లై పిల్లలు కూడా ఉన్న ఈమె కొంతకాలం క్రితం తన భర్తతో విడిపోయింది.

 Dia Mirza Second Marriage With Businessman Vaibhav Rekhi-TeluguStop.com

ఇప్పుడు మళ్ళీ రెండవ పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది.ఒక బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకుంది.

సినీ రంగంలో ప్రేమించుకోవడం.పెళ్లి చేసుకోవడం.ఆ తర్వాత కొన్నాళ్లకే విడిపోవడం సర్వసాధారణ విషయం.నటీనటులు కొంతమంది చివరిదాకా కలిసి ఉంటారు.

 Dia Mirza Second Marriage With Businessman Vaibhav Rekhi-రెండో పెళ్ళి చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా.. ఎవరినో తెలుసా -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ కొంతమంది చిన్న చిన్న విభేదాలు వచ్చినా విడాకుల వరకు వెళ్ళిపోతారు.

ఎంగేజ్ మెంట్ చేసుకున్న తర్వాత కూడా బ్రేక్ అప్ చెప్పుకున్న జంటలు కూడా ఉన్నాయి.

కొంతమంది సంవత్సరాలు ప్రేమించుకుని విడిపోయిన వారు ఉన్నారు.ఇలా ప్రేమించుకుని పెళ్లి వరకు వెళ్లిన జంటలు కొన్నే ఉన్నాయి.

వాళ్లలో కూడా విడాకులు తీసుకున్నవారు చాలా మంది ఉన్నారు.అయితే విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగా ఉండకుండా వెంటనే రెండో పెళ్ళికి సిద్దపడుతున్నారు.

దియా మీర్జా ప్రముఖ బిజినెస్ మాన్ వైభవ్ రేఖి ని ఫిబ్రవరి 15 న పెళ్లి చేసుకుంది.పెళ్లి తర్వాత ఫోటోలకు ఫోజులిచ్చారు.ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వీరు ముంబైలోని బాంద్రా లో బెల్ ఎయిర్ అపార్ట్మెంట్ లో పెళ్లి చేసుకున్నారు.

ఈ పెళ్ళికి బాలీవుడ్ నుండి మలైకా అరోరా, అతిధి రావు హైదరి, జాకీ భగ్నానీ వంటి ప్రముఖులు హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించారు.ఈ పెళ్ళికి 50 మంది అతిధులు మాత్రమే హాజరయ్యారు.

దియా మీర్జా, వైభవ్ ఇద్దరికీ ఇది రెండో పెళ్లి.దియా మీర్జా 2014 సంవత్సరంలో బిజినెస్ మెన్ సాహిల్ సంఘాను ప్రేమించి పెళ్లి చేసుకుంది.పెళ్ళికి కొన్నేళ్ల ముందు నుండే వీరిద్దరూ సహజీవనం చేసారు.ఇంట్లో పెళ్ళికి ఒప్పుకున్నా తర్వాత పెళ్లి చేసుకున్నారు.అయితే 11 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.ఇప్పుడు మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంది.

దియా మీర్జా తన పెళ్ళికి హాజరయ్యిన వారికీ స్వయంగా స్వీట్లు పంచిపెట్టింది.రెండో పెళ్లి చేసుకున్న దియా మీర్జాకు సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.

దియా మీర్జా ప్రస్తుతం నాగార్జున సరసన వైల్డ్ డాగ్ సినిమాలో ఆయన భార్య పాత్రలో నటిస్తుంది.

https://www.instagram.com/p/CLURBQvhjI7/?utm_source=ig_embed
#Wild Dog Movie #Dia Mirza

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు