మన్మధుడితో ల్యాండ్ అవుతున్న మరో బాలీవుడ్ బ్యూటీ

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సినిమాల్లో చాలా మంది హీరోయిన్లను టాలీవుడ్‌కు పరిచయం చేశారు.అయితే గతకొంత కాలంగా ఉన్న హీరోయిన్లతోనే నెట్టుకొస్తున్న నాగ్ మరోసారి ఓ బాలీవుడ్ హీరోయిన్‌కు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇప్పిస్తు్న్నాడు.

 Dia Mirza Makes Tollywood Debut With Nagarjuna Wild Dog-TeluguStop.com

కాగా ఈ బ్యూటీ ఏ కొత్త హీరోయిన్ కాదండోయ్.హైదరాబాదీ అయిన డియా మీర్జా బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు క్యారెక్టర్ పాత్రలు వేస్తున్న ఈ బ్యూటీతో నాగ్ నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ చేయనుంది.ఈ బ్యూటీ బాలీవుడ్‌లో అనేక సినిమాలు చేసినా తెలుగులో మాత్రం సినిమాలు చేయలేదు.

దీంతో ఈమెకు తెలుగులో వైల్డ్ డాగ్ మొదటి సినిమా అవుతుంది.డియా మీర్జాను ఈ సినిమాలో నాగ్ సరసన నటింపజేయాలని చూస్తున్నారు చిత్ర యూనిట్.

దీనికి డియా మీర్జా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక ఔట్ అండ్ ఔట్ కాప్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్ ఈ సినిమాను సోలోమాన్ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తుండగా నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు.మరి ఈ సినిమాతో డియా మీర్జా ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తుందో చూడాలి.

.

#Wild Dog #Dia Mirza #Nagarjuna #TollywoodMovie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు