నా రంగు నా కెరియర్ కి అడ్డంకి అయ్యిందంటున్న దియా మీర్జా

కొంత మంది హీరోయిన్లుకి ఎంత అందం ఉన్న అదృష్టం కలిసి రాక స్టార్స్ కాలేకపోతారు.కొంత మంది హీరోయిన్లు ఏవరేజ్ గా ఉన్న కూడా స్టార్ హీరోయిన్లు అయిపోతారు.

 Dia Mirza Has Revealed That Lost Projects Due To Skin Color, Bollywood, Tollywo-TeluguStop.com

అయితే స్టార్ హీరోయిన్ అవ్వాలంటే బాషని బట్టి హీరోయిన్లు లుక్స్ ఆధారపడి ఉంటాయి.తెలుగు సినిమాలలో స్టార్ హీరోయిన్ కావాలంటే మంచి కలర్ తో పాటు, రొమాంటిక్ అప్పీల్ ఉండాలి.

అలాగే తమిళ్ లో హీరోయిన్ కావాలంటే డార్క్ టింట్ ఉన్నవాళ్ళకి ఎక్కువ అవకాశం.హిందీలో స్టార్ హీరోయిన్లు కావాలంటే బికినీలు వేయడానికి రెడీగా ఉండాలి, పెర్ఫార్మెన్స్ తో పాటు బోల్డ్, టెంప్టింగ్ లుక్స్ ఉండాలి.

ఇలా ప్రాంతాన్ని బట్టి స్టార్ హీరోయిన్లు అయ్యేవారి స్టాండర్డ్ మారిపోతుంది.కొద్ది మంది మాత్రమే అన్ని బాషలలో కూడా స్టార్ హీరోయిన్లు అనిపించుకుంటారు.

అలాంటి వారిలో శ్రీదేవి ఫస్ట్ ప్లేస్ లో పెట్టొచ్చు.ఆమె తెలుగు, తమిళ్, హిందీ బాషలలో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది.

ఇదిలా ఉంటే మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొని మిస్ ఆసియా పసిఫిక్ కిరీటం సొంతం చేసుకున్న హైదరాబాదీ భామ దియా మీర్జా.ఈ అమ్మడు ఫ్యాషన్ రంగం నుంచి సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది.తెలుగులో పెద్దగా ప్రయత్నాలు చేయలేదు.కెరియర్ ఆరంభమే హిందీ నుంచి స్టార్ట్ చేసింది.

అయితే అనుకున్న స్థాయిలో అక్కడ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.తాజాగా తనకి అనుకున్న స్థాయిలో గుర్తింపు రాకపోవడానికి, అలాగే అవకాశాలు తగ్గడానికి కారణం తన స్కిన్ కలర్ అని చెప్పుకొచ్చింది.

చిత్ర పరిశ్రమలో మూస పద్ధతులు ఎక్కువగా కనిపిస్తాయి.ఈ కారణంగా నా లుక్‌ వల్ల ఎన్నోసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నా.

నా చర్మం రంగు కెరీర్‌ పరంగా నాకు అడ్డంకే అయ్యింది.ఇండస్ట్రీలో చామన ఛాయలో ఉండే మహిళలు ఇబ్బందులు పడతారని నాకు తెలుసు.

నేనూ అలాంటివే ఎదుర్కొన్నాను అని చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube