పెళ్లి చేసుకోవాలనుకున్నాం.. అంతలోనే గర్భవతినని తెలిసిందంటున్న బాలీవుడ్ బ్యూటీ!

బాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ దియా మీర్జా ఇటీవల రెండవ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.సాహిల్ సంఘ అనే బిజినెస్ మాన్ ను మొదటి వివాహం చేసుకోగా అతనితో పదకొండేళ్లు కాపురం చేసి ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల 2019లో విడిపోయారు.

 Dia Mirza Clarification Over Her Pregnancy Getting Married-TeluguStop.com

ఇక ముంబైకి చెందిన వైభవ్ రేఖిని ఫిబ్రవరిలో రెండవ పెళ్లి చేసుకుంది.ఇక అతనితో కలిసి హనీమూన్ ట్రిప్ కూడా చేసింది.

ఇదిలా ఉంటే తాజాగా ఆమె గర్భవతి అని అభిమానులతో పంచుకుంది.

 Dia Mirza Clarification Over Her Pregnancy Getting Married-పెళ్లి చేసుకోవాలనుకున్నాం.. అంతలోనే గర్భవతినని తెలిసిందంటున్న బాలీవుడ్ బ్యూటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాను సోషల్ మీడియా వేదికగా.

త్వరలోనే తల్లి కాబోతున్ననంటూ, మాతృత్వపు మధురిమలు ఆస్వాదించే క్షణాల కోసం ఎదురు చూస్తున్నాను అంటూ అభిమానులతో పంచుకుంది.కానీ నెటిజనుల నుంచి ఓ సందేహం కామెంట్ల రూపంలో ఎదురయ్యింది.

ఫిబ్రవరిలో పెళ్లి జరిగిన ఆమెకు అప్పుడే గర్భం ఏంటి? పెళ్లికి ముందే ఆమె గర్భం దాల్చారా అని కామెంట్లు ఎదురవగా ఈ విషయం చర్చగా మారింది.

Telugu Bollywood, Dia Mirza, Dia Mirza Clarity On Second Marriage, Dia Mirza Marriage, Dia Mirza Pregnancy Comments, Getting Married, Netizens, Pregnancy Before Marriage, Prenancy, Sahil Sangha, Social Media, Vaibhav Rekhi-Movie

ఇదిలా ఉంటే ఇంస్టాగ్రామ్ ఖాతాలో తాను పెళ్లి చేసుకుంటున్నాను అన్న విషయాన్ని పైగా పూజారి సమక్షంలో, వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని తెలిపిన దియా మీర్జా నా పెళ్ళికి ముందే గర్భవతిననే ఎందుకు చెప్పలేకపోయిందంటూ, పెళ్ళైన గర్భం దాల్చాలనే కట్టుబటును ఆమె అనుసరిస్తున్నారా? వివాహానికి ముందే అమ్మతనాన్ని అస్వాదిస్తే తప్పా? అనే ప్రశ్నలు ఎదురవగా.దియా ఈ ఈ విధంగా స్పందించింది.

మంచి ప్రశ్న అడిగారు అంటూ మా ఇద్దరికీ బిడ్డ పుట్ట బోతుంది కాబట్టి నేను పెళ్లి చేసుకోలేదు అని తెలిపింది.

తమ బంధం వివాహ బంధంతో ముడి పడాలని ఎప్పటినుంచో అనుకున్నామని తెలిపింది.ఇక ఆ సమయంలోనే తమ జీవితంలోకి చిన్నారి రాబోతుందని విషయం తెలియగా.ఇక తను గర్భవతి అని హడావుడిగా పెళ్లి చేసుకోలేదంటు చెప్పుకొచ్చింది.ఇక ఈ విషయం గురించి వివాహానికి ముందే ప్రకటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలుపగా ఆ సమయంలో తను ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఇక ఈ విషయము గురించి ఎటువంటి స్పష్టత ఉంటుందా, ఉండదా అని చెప్పలేదని తెలిపింది.

ఇక ఇది తన జీవితంలో ఎంతో సంతోషకరమైన విషయమని ఇలాంటి రోజు కోసం తాను ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నానంటూ, ఇప్పుడు తన కల నేరవేరిందని, మీరనుకుంటున్నట్లు తల్లి కాబోతున్న విషయాన్ని ఆలస్యం గా ప్రకటించడంలో మరో ఉద్దేశం లేదని తెలిపింది

.

#Dia Mirza #Netizens #Sahil Sangha #DiaMirza #PregnancyBefore

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు