యువ ప్రతిభ తో దద్దరిల్లిన ధ్వని…

రవీంద్ర రెడ్డి,వినయ్ ప్రాణి గ్రహి, త్రినాధ్ వర్మ కథానాయకులుగా స్వాతి మందాడి, భావన సాగి కథానాయికలుగా ,.సాయి సాధన నన్నపనేని, సాన పరమకృష్ణ నిర్మాణ సారథ్యంలో నాని సాన దర్శకత్వం లో తెరేకెక్కిన సినిమా “120DB ధ్వని” ఈ నెల 20 వ తారీకు న విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది.

 Dhwani Movie Success Meet  ,  Ravindra Reddy, Vinay Prani Grahi, Trinadh Verma,s-TeluguStop.com

విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు పొందింది.ధ్వని ప్రేమ ను పుట్టిస్తాధి, ధ్వని స్నేహాన్ని బలపరుస్తాధి.

ఒక్కోసారి ప్రాణాలు ను కూడా తీస్తుంది.ఇలాంటి ఎన్నో హృదయాన్ని తాకే మంచి సంభాషణలతో సినిమా నిండి ఉంది.

ముందు కథ విషయానికి వస్తే, చలన చిత్ర చరిత్ర లోనే ఈ సినిమా మొదటి “sound based story” .డైరెక్టర్ నాని సాన ఈ కథ నీ చాలా చక్కగా రాసుకున్నారు.అలాగే రాసుకున్న కథ నీ చాలా అద్భుతంగా తెరకెక్కించారు.

వెండి తెర మీద ప్రతి ఫ్రేమ్, ప్రతి సన్నివేశం చాలా అద్భుతంగా ఉంది.

కొత్త డైరెక్టర్ అయిన అనుభవం ఉన్న వారిలా సినిమా తీశాడు.ఇక శేశాంక్ శ్రీరామ్ కెమెరా పనితనం చాలా అద్భుతంగా ఉంది.కథలో ప్రతి ఎమోషన్ నీ కొత్త తీశారు.ప్రతీక్ అభ్యయంకర్ సంగీతం చాలా మంచిగా ఉంది.

ఉగ్రతరూపని అనే పాట చాలా మంచి గా ఉంది.సినిమాలోని మిగతా పాటలు కూడా చాలా బాగున్నాయి.

ఆనంద్ నంబియార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమా నీ మరో స్థాయి కి తీసుకు పోయింది.రాజకృష్ణ ఆడియో గ్రఫి మంచిగా ఉంది.

అల్లావుద్దీన్ ఎడిటింగ్ చాలా అద్భుతంగా ఉంది.ఎక్కడ ప్రేక్షకులకి ఊహకి అందని కూర్పుతో ప్రతి సన్నివేశాన్ని చాలా అద్భుతంగా తీర్చి దిద్దారు.

ఇక నటుల గురించి కచ్చింతంగా మాట్లాడుకోవాలి . వినయ్ ప్రాణి గ్రాహి ఈ సినిమా లో తన పాత్ర లో జీవించాడు .ప్రతి ఎమోషన్ నీ అతను నటించిన విధానం కట్టిపడేసింది.త్రినాధ్ వర్మ నటన హైలెట్ ఈ కథకి .ఒక వైపు సమాజం కోసం, మరో వైపు తన ఫ్రెండ్ నీ కాపాడుకోవడం కోసం అతను నటించిన విధానం చాలా బాగుంది. రవీందర్ రెడ్డి నటన,ఆయన క్యారీ చేసిన ఎమోషన్, కోపం, లవర్ బాయ్ గా, ఫ్రెండ్ కి కష్టాల్లో తోడుండే ఫ్రెండ్ గా చాలా అద్భుతంగా నటించారు.

కథానాయికలు స్వాతి తన పాత్ర పరిధిలో నటించింది.భావన సాగి నటన స్టైలిష్ గా ఉంది.అందురు కొత్త వాళ్ళు అయిన చాలా అద్భుతంగా నటించారు.సినిమాలోని మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళ పాత్ర పరిధి లో నటించి మెప్పించారు

ప్రేక్షకులనుండి సినిమాకి చాలా భారీ స్పందన వస్తుంది.

సినిమా మొదటి భాగం లో అన్ని క్యారెక్టర్స్ ని పరిచయం చేసి ఇంటర్వెల్ ముందు ఊహించని మలుపు తిప్పి బ్రేక్ ఇచ్చారు.తర్వాత మొదటి సన్నివేశం నుండే చాలా ఆసెక్తి గా మొదలు అయ్యి పతాక సన్నివేశాలకు చేరుకోగానే ఊహించని మలుపులతో సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు.

మొదట చిన్న సినిమాగా రిలీజ్ అయినా పెద్ద సినిమాలా విజయం సాధించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube