ధృవ రివ్యూ

చిత్రం : ధృవ బ్యానర్ : గీతా ఆర్ట్స్ దర్శకత్వం : సురెందర్ రెడ్డి నిర్మాత : అల్లు అరవింద్ సంగీతం : హిప్ హాప్ తమిజా విడుదల తేది : డిసెంబర్ 9, 2016 నటీనటులు : రామ్ చరణ్, రకుల్ ప్రీత్, అరవింద్ స్వామి కొంతకాలంగా సరైన హిట్ లేక కాస్త స్పీడ్ తగ్గాడు రామ్ చరణ్ తేజ్.

అయితే రామ్ చరణ్ తాపత్రయం కేవలం హిట్ కొట్టడమే కాదు, కేవలం మాస్ ప్రేక్షకులకే పరిమితం కాకుండా యూనివర్సల్ సినిమాలు చేసి యూనివర్సల్ ఫాలోయింగ్ పొందడం.

ఆ ప్రయత్నంలోనే తమిళ చిత్రం తని ఒరువన్ సినిమాని "ధృవ" గా రీమేక్ చేశాడు చరణ్.మరి ఈ ప్రయత్నం ఎలా సాగిందో చూద్దాం.

కథలోకి వెళ్తే .ధృవ (రామ్ చరణ్), పోలీస్ ట్రైనింగ్ లో ఉండగానే గుట్టుచప్పుడు లేకుండా సాధ్యమైనంతవరకు క్రైమ్ రేట్ పై దండెత్తుతాడు.అయితే ధృవ ఆశయం చిన్న చిన్న నేరాలను అరికట్టడం కాదు, ఈ నేరాలన్నిటి ఆర్గనైజ్ చేస్తూ, రాజకీయాల్ని, నేరాలని నడిపిస్తున్న మాస్టర్ మైండ్ ని పట్టుకోవడం.

ఆ పెద్దమనిషే ప్రముఖ సైటింస్ట్ సిద్ధార్థ్ అభిమన్యు (అరవింద్ స్వామి).చాలా పెద్ద నేర ప్రపంచానికి అధిపతి అయిన సిద్ధార్థ్ ని అడ్డుకోవడానికి ధృవ వేసిన ఎత్తులు పైఎత్తులు ఏంటో, అతనికి ఆశయం కోసం ఇషిక (రకుల్ ప్రీత్) చేసిన సహాయం ఏంటో తెర మీద చూడాల్సిందే.

Advertisement

నటీనటుల నటన గురించి కాస్త డిబేట్ కి ఆస్కారం ఉండొచ్చు ఏమో కాని, రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫర్మెన్స్ ఇచ్చేశాడు.సబ్టిల్ గా, ఇంటెన్స్ గా సాగిన చరణ్ నటన అద్యంతం కథలో ప్రేక్షకులు లీనమయ్యేలా చేస్తుంది.

ముఖ్యంగా రకుల్ కి ప్రేమను వ్యక్తపరిచే సన్నివేశంలో చరణ్ నటన అద్భుతం.ఒక నటుడిగా చరణ్ కెరీర్ లో మైలురాయి ధృవ.అరవింద్ స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువే.ఆయన పాత్ర, ఆయన నటనే ఈ సినిమాకి ఆయువుపట్టు.

సినిమా నుంచి బయటకి వచ్చాక, కథనాయికుడి పాత్ర కన్నా విలన్ పాత్రే జనాలకి బాగా గుర్తిండుపోతుంది.రకుల్ ఫర్వాలేదు.

నవదీప్ ఉన్నంతలో బాగా చేశాడు.కామేడి కావాలని కోరుకునే ప్రేక్షకులని పోసాని నిరుత్సాహపరచలేదు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
1000 కోట్లతో చరిత్ర సృష్టించిన పుష్పరాజ్.. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమానే!

సాంకేతికవర్గం పనితీరు సినిమాటోగ్రాఫి ఈ సినిమాకి కథ, కథనం, హీరో విలన్ పాత్రల తరువాత చాలా పెద్ద బలం.ఏమాత్రం సినిమా పరిజ్ఞానం ఉన్నా, సినిమాటోగ్రాఫి గురించి గంటలు గంటలు మాట్లాడుకోవచ్చు.సినిమాని ఇంత బాగా ఎలివేట్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ మధ్య కాలంలో చూడలేదు.

Advertisement

హిప్ హాప్ నేపథ్య సంగీతం సినిమాకి అదనపు బలం.పాటలు కూడా ఆకట్టుకుంటాయి.తెలుగు సినిమాల్లో డిఐ వర్క్ గురించి మాట్లాడుకోవడానికి పెద్దగా అవకాశం దక్కదు.

కాని ధృవలో డిఐ అత్యద్భుతంగా ఉంది.నిర్మాణ విలువలు అదిరిపోయాయి.

విశ్లేషణ తని ఒరువన్ తమిళనాట ఒక మోడ్రన్ ఏజ్ క్లాసిక్.IMDB లో ఈ చిత్రం యొక్క రేటింగ్ 8.9.ఇక్కడే అర్థం చేసుకోండి, కథలో, పాత్రల్లో ఉన్న దమ్ము ఎంటో.అలాంటి సినిమాని రీమేక్ చేయడం.

ఏమాత్రం చెడిపోకుండా తీయడమే కాదు, కథలోకి కొత్తగా తీసుకొచ్చిన "8" ఐడియాని బాగా చూపించడంలో సురెందర్ రెడ్డి సఫలమయ్యారు.సినిమాకి ఎక్కడా డల్ అవదు.

ఫస్టాఫ్ లో ఉండే రకుల్ లవ్ ఎపిసోడ్లు కాస్త ఇంటెన్సిటిని తగ్గించిన, మొదటి భాగం చివరి 20 నిమిషాల్లో కథలోకి పూర్తిగా లీనమయిపోతాడు ప్రేక్షకుడు.అక్కడినుంచి గ్రిప్పింగ్ గా వెళుతుంది.

పరేషానురా పాట అవసరం లేదు కాని రకుల్ గ్లామర్ వలన ఆ పాట కూడా బోర్ కొట్టదు.ఓవరాల్ గా చెప్పాలంటే, పెట్టిన టికేట్ ని నూరుపాళ్ళు న్యాయం చేసే సినిమా.

అయితే, రామ్ చరణ్ నుంచి ఆశించే పంచ్ డైలాగులు, మాస్ మసాలా అంశాలు మాత్రం ఆశించవద్దు.హైలైట్స్ : * రామ్ చరణ్, అరవింద్ స్వామి * కథ, కథనం * సినిమాటోగ్రాఫి * పాటలు, నేపథ్య సంగీతం * హీరో విలన్ సన్నివేశాలు డ్రాబ్యాక్స్ : * ఫస్టావ్ లో లవ్ ఎపిసోడ్స్ * బిజినెస్ పరంగా ఫక్తు రామ్ చరణ్ సినిమా కాదు

తెలుగుస్టాప్ రేటింగ్ : 3.5/5

.

తాజా వార్తలు