తమిళ అర్జున్‌ రెడ్డి విడుదలకు ముందే ఫ్లాప్‌.. తెలుగు ప్రేక్షకుల పెదవి విరుపు  

Dhruv Vikram\'s First Look From Varma, The Tamil Remake Of Arjun Reddy-

విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే నటించిన అర్జున్‌ రెడ్డి చిత్రం ఫలితం ఏంటీ, ఆ చిత్రం ఏ స్థాయిలో వసూళ్లను సాధించింది అనే విషయాలను ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.టాలీవుడ్‌లో ఒక ట్రెండ్‌ సెట్టర్‌ చిత్రంగా నిలిచిన ఆ చిత్రం రికార్డుల మోత మ్రోగించింది.అద్బుతమైన విజయాన్ని దక్కించుకున్న ఆ చిత్రం కొత్త రకం సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు కొత్త దర్శకులకు ఊతం ఇచ్చింది..

Dhruv Vikram\'s First Look From Varma, The Tamil Remake Of Arjun Reddy--Dhruv Vikram's First Look From Varma The Tamil Remake Of Arjun Reddy-

తెలుగు సినిమా అయినంత మాత్రాన ముద్దు సీన్స్‌ ఉండవద్దా అంటూ ప్రశ్నిస్తూ వచ్చిన అర్జున్‌ రెడ్డి చిత్రం సరికొత్త శకంకు నాంది పలికిన విషయం తెల్సిందే.

అర్జున్‌ రెడ్డి చిత్రం తెలుగులో భారీ విజయాన్ని దక్కించుకున్న కారణంగా తమిళంతో పాటు కన్నడం, మలయాళం, హిందీల్లో కూడా రీమేక్‌ అవుతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ తమిళంలో రూపొందుతున్న ఈ రీమేక్‌కు ‘వర్మ’ అనే టైటిల్‌ను పెట్టారు.తాజాగా వర్మ ఫస్ట్‌ లుక్‌ మరియు టీజర్‌లు వచ్చాయి.

ఈ చిత్రంతో స్టార్‌ హీరో విక్రమ్‌ తనయుడు దృవ్‌ హీరోగా పరిచయం కాబోతున్నాడు.రికార్డు స్థాయిలో అంచనాలున్న ‘వర్మ’ చిత్రంలో కూడా తెలుగు అర్జున్‌ రెడ్డి తరహా ముద్దు సీన్స్‌ ఉండబోతున్నట్లుగా టీజర్‌తోనే చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పారు..

అర్జున్‌ రెడ్డిని ఉన్నది ఉన్నట్లుగా దించేస్తున్నట్లుగా టీజర్‌ను బట్టి అర్థం అవుతుంది.ఏమాత్రం తగ్గకుండా అద్బుతమైన విజువల్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే తెలుగు మీడియాలో మరియు తెలుగు ప్రేక్షకుల్లో మాత్రం ‘వర్మ’ విషయంలో అసంతృప్తి వ్యక్తం అవుతుంది.హీరో పాత్రకు విజయ్‌ దేవరకొండ షూట్‌ అయినంతగా మరెవ్వరు సూట్‌ కాలేరు.ముఖ్యంగా ధృవ్‌ ఏమాత్రం వర్మ పాత్రకు సూట్‌ కాలేదని, సినిమా విడుదలైతే ఫలితం ఎలా ఉంటుందో తెలియడం లేదు అంటూ తెలుగు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..

తమిళ ప్రేక్షకులు మాత్రం ‘వర్మ’ను పిచ్చి పిచ్చిగా నచ్చేస్తున్నారు.వారికి అర్జున్‌ రెడ్డి సినిమా తెలియదు కనుక వర్మ లుక్‌కు ఫిదా అవుతున్నారు.అయితే అర్జున్‌ రెడ్డిని ఊహించుకున్న కళ్లతో వర్మను చూడలేక పోతున్నారు తెలుగు ప్రేక్షకులు.

‘వర్మ’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది.