ధోనీ ని కలవాలని తన అభిమాని ఏకంగా..?!

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ధోనీ ఏది చేసినాగాని అది ఒక ట్రేండ్ గా మారుతుంది.

 Dhoni Fans 1436 Wlks For Dhoni Ms Dhoni, Meet , Latest News, Viral, Fan, Sport-TeluguStop.com

అప్పట్లో థోనీ హెయిర్ స్టైల్ బాగా ఫేమస్ అయింది.ఆయన అభిమానులు సైతం ఆయన బాటలోనే పయనించారు.

ధోనీ మీద అభిమానంతో అతన్ని చూడాలని ఎంతోమంది అభిమానులు కలలు కంటారు.మనం ఎవరిని అన్నా ఒక్కసారి మనస్ఫూర్తిగా అభిమానించడం మొదలుపెడితే ఆ వ్యక్తి కోసం ఏమి చేయడానికి కూడ వెనకాడం కదా.కొందరు వీరాభిమానులు ఆయన్ని కలిసి ఒక సెల్ఫీ దిగాలని సుదూర ప్రాంతాల నుంచి పాదయాత్ర చేసి మరి అతడితో సెల్ఫీ దిగిన సందర్భాలు కూడా చాలానే మనం చూసి ఉంటాము.ఈ క్రమంలోనే ఒక యువకుడు ధోనీని ఎంతగానో అభిమానిస్తాడట.

ఒకవిధంగా చెప్పాలంటే ధోనీకి డై హార్డ్ ఫ్యాన్ అని చెప్పాలి.ఎందుకంటే ధోనీని చూడడానికి హరియాణాకు చెందిన అజయ్‌ గిల్‌ ఒక గొప్ప సాహసమే చేసాడని చెప్పాలి.

ఆయనను కలిసి ఒక ఫోటో దిగి, ధోనీ ఆశీర్వచనలు తీసుకొనేందుకు అజయ్‌ గిల్‌ ఏకంగా 1,436 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాంచీకి వచ్చి ధోనీని కలిసాడు.ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది.

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గిల్‌ ఇలా నడిచిరావడం ఇది రెండోసారి కావడం విశేషం అని చెప్పాలి.ఈ విషయం తెలిసి ధోనీ కూడా గిల్‌కు స్వాగతం తెలిపాడు.

అలాగే ప్రత్యేకంగా వ్యవసాయ క్షేత్రంలో గిల్ కి విడిది ఏర్పాటు చేసి భోజనం కూడా పెట్టించాడు.

Telugu Latest, Meet, Msdhoni-Latest News - Telugu

అలాగే గిల్ తో పాటు కలిసి సెల్ఫీ దిగి ఆటోగ్రాఫ్‌ కూడా ఇచ్చాడట.కాగా తన అభిమాని తిరిగి హరియాణాకు వెళ్లేందుకు విమానం టికెట్లు కూడా బుక్‌ చేసి మరి పంపాడట.ఈ సందర్భంలో గిల్ తనకు ఉన్న కల గురించి తెలిపాడు.

ఒక్కసారైనా టీమ్‌ఇండియాలో ఆడాలన్నది గిల్‌ కలగా తెలిసింది.గిల్ కు మొదటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం.

ఆ ఇష్టంతోనే కొన్ని కొన్ని మ్యాచ్ లు కూడా ఆడాడట.కానీ కొన్నాళ్ళకు క్రికెట్ ఆపేసాడట.

మళ్ళీ ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ క్రికెట్‌ మొదలు పెట్టేందుకు తాను ఎంతగానో అభిమానించే ధోనీ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని రాంచీకి వచ్చినట్లు తెలుస్తుంది.అయితే గిల్ ఇలా ధోనీని కలవడానికి మొదటిసారి 16 రోజుల సమయం పట్టిందట.

మళ్ళీ ఇప్పుడు రెండోసారి ధోనీ ని కలవడానికి 18 రోజుల సమయం పట్టిందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube