ఈ ప్రపంచ కప్ తో మహేంద్ర సింగ్ ధోని ఇక క్రికెట్ కి వీడ్కోలు చెప్పబోతున్నాడా ?

ఒకప్పుడు భారత క్రికెట్ జట్టు కి మంచి వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ అవసరం ఉండేది , చాలా మంది ఆటగాళ్లను తీసుకున్నారు కానీ ఎవరూ ఆ పాత్ర కి న్యాయం చేయలేకపోయారు.ఇక చేసేదేం లేదని భారత బ్యాట్స్ మెన్ రాహుల్ ద్రవిడ్ తో వికెట్ కీపింగ్ చేయించారు.

 Dhoni To Retire After World Cup 2019-TeluguStop.com

అలాంటి సమయం లో జట్టు లోకి వచ్చాడు మహేంద్ర సింగ్ ధోని, అతను ఆడిన తొలి వన్డే సిరీస్ లో ఘోరంగా విఫలమయినా పాకిస్తాన్ తో ఆడిన తరువాత సిరీస్ లో తన సత్తా ఏమిటో చూపించాడు.అప్పటి నుండి ఇక వెనుదిరిగి చూసుకోలేదు.

ఇక 2007 లో తొలిసారి జరిగిన టీ20 ప్రపంచ కప్ కి నాయకత్వ బాధ్యతలు అందుకున్న ధోని తన అద్భుత కెప్టెన్సీ తో జట్టు ని ముందుండి నడిపించాడు.కెప్టెన్సీ బాధ్యతలు తీసుకొని ఆడిన తొలి టీ20 ప్రపంచ కప్ గెలిచి తనలో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని రుజువు చేసాడు.

దాదాపు భారత జట్టు ని ధోని తన కెప్టెన్సీ లో అన్ని ఫార్మాట్లలో నెంబర్ 1 గా నిలిపాడు.ఐసీసీ నిర్వహించే టీ20 , 50 ఓవర్ల ప్రపంచ కప్ తో సహా ఛాంపియన్ ట్రోఫీ ధోని నాయకత్వం లో భారత జట్టు గెలిచింది.

ఈ ఘనత ప్రపంచం లో ఏ కెప్టెన్ సాధించలేదు.

ఈ ప్రపంచ కప్ తో మహేంద్ర సింగ్ �

ధోని అంటే ఒక గొప్ప కెప్టెన్ , వికెట్ కీపర్ , మంచి ఫీనిషేర్.భారత జట్టు గెలిచిన చాలా మ్యాచ్ లలో ధోని కీలక పాత్ర పోషించాడు.తన కెప్టెన్సీ తో ఎత్తులు వేస్తే, తన వికెట్ కీపింగ్ తో వికెట్ల వెనుక మాయ చేస్తాడు అలాగే చివరి బంతికి సిక్స్ కావాలంటే అలవోకగా కొట్టేసాడు.

ధోని ప్రపంచ కప్ తరువాత రిటైర్మెంట్ ?

ఈ ప్రపంచ కప్ తో మహేంద్ర సింగ్ �

ఇప్పటికే 2014 లో టెస్ట్ ల నుండి రిటైర్ అయిన ధోని.కేవలం వన్డే , టీ20 లలో మాత్రమే ఆడుతున్నాడు.వన్డే లలో యువ ఆటగాళ్లకు తన వంతు సలహాలు ఇస్తూనే , కెప్టెన్ విరాట్ కోహ్లీ కి కూడా కెప్టెన్సీ లో సూచనలు ఇస్తున్నాడు.ఇప్పటికే వయస్సు పెరిగిన యువ ఆటగాళ్లకు పోటీ గా రాణిస్తున్నాడు ధోని.

కానీ 2019 ప్రపంచ కప్ తరువాత ధోని జట్టు లో ఉంటాడో లేదో తెలియదు అందుకే ప్రపంచ కప్ ఆడగా రిటైర్మెంట్ ఇస్తాడాని వార్తలు వస్తున్నాయి.ఇటీవల జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో చెన్నై జట్టు ముంబై పై ఓటమి పాలయింది.

ఈ మ్యాచ్ అనంతరం సంజయ్ మంజ్రీకార్ ధోని తో వచ్చే సీజన్ లో చూడచ్చ అని ప్రశ్న వేసాడు.దానికి బదులుగా ధోని బహుశా చూడచ్చేమో అని బదులు ఇచ్చాడు.

ఏది ఏమైనా ధోని తన 15 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో టీమ్ ఇండియా కి ఎన్నో కప్ లు సాధించాడు.భారత జట్టు అత్యుత్తమ కెప్టెన్ , భారత జట్టు అత్యుత్తమ కీపర్ , భారత జట్టు అత్యుత్తమ ఫీనిషేర్ ఎవరంటే.

క్రికెట్ అభిమానులు ఎవరైనా చెప్పే పేరు ఒకటే.మహేంద్ర సింగ్ ధోని

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube