15 నెలల తరువాత నేడు మైదానంలో కనపడబోతున్న ధోని… నేటి నుంచే మొదలు కానున్న ఐపీఎల్…!  

dhoni to appear on the field today after 15 months ipl starting from today ipl2020, mahendra singh dhoni, UAE, mumbai indians, chennai super kings - Telugu Chennai Super Kings, Ipl2020, Mahendra Singh Dhoni, Mumbai Indians, Uae

అసలు ఈ సంవత్సరం ఐపీఎల్ భారతదేశంలో జరుగుతుందో జరగదు అని చాలామంది భావించారు.కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి నెలలో మొదలు కావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ ఎట్టకేలకు సెప్టెంబర్ 19 నుండి యూఏఈ దేశంలో మొదలు కాబోతోంది.

TeluguStop.com - Dhoni To Appear On The Field Today After 15 Months Ipl Starting From Today

ఇక ఇందుకు సంబంధించి అన్ని కార్యక్రమాలను బీసీసీఐ పూర్తిచేసి మ్యాచ్లను నిర్వహించేందుకు సిద్ధమైంది.

ఇక గత పదిహేను నెలల నుండి అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉంటున్న మహేంద్రసింగ్ ధోని ఎట్టకేలకు నేడు తన అభిమానులను ఉత్సాహపరిచేందుకు మైదానంలో అలరించబోతున్నాడు.

TeluguStop.com - 15 నెలల తరువాత నేడు మైదానంలో కనపడబోతున్న ధోని… నేటి నుంచే మొదలు కానున్న ఐపీఎల్…-General-Telugu-Telugu Tollywood Photo Image

గత సంవత్సరం ప్రపంచ కప్ లో జరిగిన సెమీస్ మ్యాచ్ లో మహేంద్రసింగ్ ధోని చివరిసారి మైదానంలో కనిపించాడు.ఇక అప్పటి నుంచి మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉంటూ వచ్చాడు.

ఇక గత నెలలో అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన ప్రస్తుతం ధోని పై ఎటువంటి ఒత్తిడి లేకపోవడంతో ఈసారి మహేంద్రసింగ్ ధోని ఐపిఎల్ లో తన మార్క్ చూపిస్తాడని అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

యూఏఈలో నిర్వహించబోయే ఈ ఐపీఎల్ మెగా టోర్నీ మొత్తం బయో వాతావరణంలో నిర్వహించబోతున్నారు.

మ్యాచ్ లకు ఎటువంటి క్రీడా అభిమానులను అనుమతించే ప్రసక్తే లేకుండా చర్యలను చేపడుతున్నారు.ఇక నేడు మొట్ట మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య సాయంత్రం 07:30 లకు మొదలు కాబోతోంది.మొట్ట మొదటి మ్యాచే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో పాటు, మరోవైపు మహేంద్రసింగ్ ధోని మైదానంలో ఆడుతుండడంతో నేటి మ్యాచ్ కు ప్రాధాన్యత ఏర్పడింది.ఇక గత సంవత్సరం విన్నర్స్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ మరోసారి ఛాంపియన్ హోదాను నిలబెట్టుకోవాలని పట్టుదలగా కనబడుతోంది.

అలాగే ప్రతి జట్టు ఈ సారి ఐపీఎల్ కప్ గెలవాలని పట్టుదలతో ఉన్నారు.

#MahendraSingh #ChennaiSuper #Mumbai Indians #IPL2020

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dhoni To Appear On The Field Today After 15 Months Ipl Starting From Today Related Telugu News,Photos/Pics,Images..