చిన్నారి ఫ్యాన్స్‌కు ధోని అదిరిపోయే సర్‌ప్రైజ్.. వారి ఆనందానికి అవధుల్లేవ్

చైన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన చిన్నారి అభిమానులకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు.దీంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.

 Dhoni Surprise For Child Fans Gave Signed Ball For Two Children In Csk Vs Dc Mat-TeluguStop.com

స్టాండ్స్‌లో గెంతుతూ ఫుల్లు ఖుషీ అయిపోయారు ఆ ఇద్దరు చిన్నారులు.నిన్న జరిగిన మ్యాచ్‌లో ధోని తన విశ్వరూపం చూపించి CSK జట్టును ఫైనల్‌కు చేర్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే స్టాండ్స్‌లో ఉన్న ఇద్దరు చిన్నారులు భావోద్వేగానికి గురవ్వగా మిస్టర్ కూల్ వారిని సర్ ప్రైజ్ చేసి వారి కళ్లలో ఆనందాన్ని చూశాడు.

అయితే, దుబాయ్‌ వేదికగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగగా సీఎస్కే జట్టు ఘనవిజయం సాధించింది.

ఈ మ్యాచ్‎లో ధోని తనలోని పాత ఆటగాన్ని మరోసారి అందరికీ గుర్తుకు చేశాడు.దీంతో చెన్నై 4 వికెట్ల తేడాతో ఢిల్లీని మట్టికరిపించి మరోసారి ఫైనల్‎కు చేరుకుంది.

కేవలం 6 బంతుల్లోనే ధోని 18 పరుగులు రాబట్టి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.నెంబర్ అనేది వయస్సుకు తప్పా ఆటకు కాదని క్రికెట్ లోకానికి చాటిచెప్పాడు.

మిస్టర్ కూల్ మహీ చివరి ఓవర్లో 3 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి మ్యాచ్‎ను జట్టును గెలిపించడంతో CSK ఆటగాళ్ళు డ్రెస్సింగ్ రూమ్‌లో, మరియు స్టాండ్స్‌లో ఉన్న అభిమానులు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.ఓడిపోతుందనుకున్న చెన్నై జట్టు గెలవడంతో ఇద్దరు చిన్నారులు తమ భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు.

అది గమనించిన ధోని వారికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు.

తాను సంతకం చేసిన బాల్‌ను ఆ ఇద్దరు చిన్నారులు ఉన్న స్టాండ్స్‌లోకి విసిరాడు.ఆ బంతిని తీసుకున్న వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.ఆనందం తట్టుకోలేక గంతులు వేశారు.

ఈ గేమ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేయగా.పృథ్వీ షా 34 బంతుల్లో 60 పరుగులు, రిషబ్ పంత్ 35 బంతుల్లో 51 పరుగులు చేసి వెనుదిరిగారు.

దీంతో 173 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ధోని సేనలో రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప బానే ఆడారు.కానీ, ఉతప్ప ఔట్ అయ్యాక చెన్నై జట్టు 2 వికెట్లను వెనువెంటనే కోల్పోయింది.చివరి2 ఓవర్లలో 24 పరుగులు చేయాల్సి ఉండగా మోయిన్ అలీ కూడా ఔట్ అయ్యాడు.దీంతో క్రీజులోకి వచ్చిన ధోని తొలి బంతిని మిడ్ వికెట్ మీదుగా సిక్స్ బాదాడు.

ఆ తర్వాత టామ్ కరన్ బౌలింగ్‎లో వరుసగా 3 ఫోర్లు బాది.తాను ఇంకా పాత ధోనినే(తలైవా) అని మరోసారి ప్రూవ్ చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube