మరో రికార్డ్ నెలకొల్పిన ధోనీ.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!

ఐపిఎల్ అంటే మనకు గుర్తొచ్చేది ముగ్గురే ముగ్గురు.అందులో కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలు గుర్తుకొస్తారు.

 Dhoni Sets Another Record .fans Celebrating ..! Ms Dhoni, New Record, Sports Upd-TeluguStop.com

అందులోనూ ధోనీ అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు.ఐపీఎల్‌ లో చెన్నై సూపర్‌ కింగ్స్ వికెట్‌ కీపర్‌ గా ఎంఎస్‌ ధోని ఎప్పటి నుంచో ఫామ్ లో ఉన్నాడు.

ఈ నేపథ్యంలోనే ఈ కూల్ కెప్టెన్ ఓ అరుదైన రికార్డును సాధించాడు.మధ్యలో ఒక సీజన్‌ ధోనీ ఆటకు దూరంగా ఉన్నాడు.

మొదటి నుంచి సీఎస్‌కే టీమ్ కు ఆడుతున్న ధోని వికెట్‌ కీపర్‌ గా 100 క్యాచ్‌ లు అందుకుని అరుదైన రికార్డును నెలకొల్పాడు.సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ లో వృద్దిమాన్‌ సాహా క్యాచ్‌ పట్టడంతో ఈ రికార్డు సాధించాడు.

ధోని తర్వాత ఒకే టీమ్ లో ఆడుతున్న వారిలో రైనా 98 క్యాచ్‌ లు పట్టుకుని రెండో స్థానంలో ఉన్నాడు.ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌ క్రికెటర్ కీరన్‌ పొలార్డ్‌ 94 క్యాచ్‌ లతో మూడో స్థానంలో ఉన్నాడు.

మొత్తానికి చూస్తే ధోని ఐపీఎల్‌ లో వికెట్‌ కీపర్‌ గా 215 మ్యాచ్‌ లు ఆడాడు.అందులో 119 క్యాచ్‌ లు పట్టగా 39 స్టంప్స్‌ తీశాడు.

దీంతో మొత్తం 158 డిస్‌మిసిల్స్‌ ఉన్నాయని చెప్పుకోవచ్చు.ఎస్‌ఆర్‌హెచ్‌ తో మ్యాచ్‌ ద్వారా ధోని మరో రికార్డును నెలకొల్పాడు.

ధోని వికెట్‌ కీపర్‌గా ఒకే మ్యాచ్‌ లో ముగ్గురి కంటే ఎక్కువ బ్యాట్స్‌మెన్‌ క్యాచ్‌ లు తీసుకోవడం ఇది పదోసారి కావడంతో మరో రికార్డును నెలకొల్పాడు.

Telugu Catches, Fans, Msdhoni, Latest-Latest News - Telugu

ధోని తర్వాత ఆ రకంగా ఏబీ డివిలియర్స్‌ 5 సార్లు ఒకే మ్యాచ్‌ లో మూడు అంతకంటే ఎక్కువ క్యాచ్‌ లు పట్టుకుని రెండో స్థానంలో నిలిచాడు.దీనికి తోడుగా ఎంఎస్‌ ధోనీ పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఒకప్పటి సీఎస్‌కే ఓపెనర్ మాథ్యూ హేడెన్‌ అభినందించారు.ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ లో చెన్నై కెప్టెన్ ఎంతో గొప్ప క్రీడాకారుడు అంటూ కామెంట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ధోనీ సీఎస్‌కే తరపున ఆడుతూ వస్తున్నాడు.మొదటి సీజన్ నుంచి కెప్టెన్సీని చేస్తూ కూల్ గా ఉన్నాడు.ఈ తరుణంలోనే మహీ సారథ్యంలో చెన్నై టీమ్ ఇప్పటికే మూడుసార్లు ఐపీఎల్ ట్రోఫీని అందుకుని అభిమానుల ప్రశంసలు పొందింది.ఇప్పుడు ఇంకోసారి టైటిల్ సాధించడానికి చాలా దూరంలో లేదనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube