రాజువయ్య మహరాజువయ్య: అందు కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోని మహి..!

క్రికెట్ ను ఇష్టపడే ప్రతి ఆటగాడు ఇష్టపడే క్రికెటర్ ఎవరు అంటే మహేంద్ర సింగ్ ధోనీ అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.క్రికెట్ ఆట తెలియని వారికి కూడా ధోనీ ఎవరో తెలుసు.

 Dhoni Not Taking Any Money For Doing As A Mentor For Team India-TeluguStop.com

అంతలా ప్రేక్షకుల అభిమానాన్ని చోరుగున్నాడు ఎంఎస్ ధోనీ.అయితే ధోనీ గురించి మీకు తెలియని విషయం ఒకటి ఉంది.

ఆ విషయాన్నీ స్వయంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా సెక్రటరీ అయిన జై షా నే చెప్పడం జరిగింది.జై షా మాట్లాడుతూ ఎంఎస్ ధోనీ గురించిన ఒక గొప్ప విషయాన్నీ చెప్పారు.

 Dhoni Not Taking Any Money For Doing As A Mentor For Team India-రాజువయ్య మహరాజువయ్య: అందు కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోని మహి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ధోనీ టీమిండియాకు మెంటార్ గా వ్యవహరిస్తున్న విషయం మీకు తెలిసిందే.అయితే మెంటార్ గా ఉంటున్నందుకు ఆయన ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదని జై షా చెప్పారు.

అక్టోబర్ 1 నుంచి యూఏఈలోని ఒమన్ వేదికగా ఆరంభం కాగా దీనికి మాజీ కెప్టెన్ మెంటార్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎంఎస్ ధోనీ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మెంటార్ గా వున్నాడు.

ధోనీ సేవలందుకోవడం నిజంగా బీసీసీఐ గొప్పతనంగా భావిస్తుందని అన్నారు.కేవలం టీ20 వరల్డ్ కప్ కోసం మాత్రమే ధోనీ ఈ బాధ్యతలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

వన్డే వరల్డ్ కప్ 2020 తర్వాత ధోనీ తన రిటైర్మెంట్ ప్రకటించేశారు.ఆ తర్వాత జరుగుతున్న వరల్డ్ కప్ ఈవెంట్ మళ్లీ ఇదే అవ్వడం విశేషం అనే చెప్పాలి.

అంతేకాకుండా ఎంఎస్ ధోనీ ఇలా వ్యవహరిస్తున్నందుకు ఎలాంటి లాభం పొందడం లేదు’ అని జై షా అన్నారు.ఈ విషయం పై కెప్టెన్ విరాట్ కోహ్లీని సంప్రదించి, ఆ తర్వాత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మని సంప్రదించిన తర్వాతనే జైషా ఈ నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించారు.

Telugu Bcci Jay Sha, Dhoni Mentor For Team India, Dhoni Not Taking Any Money, Kohli, Latest News, Latest Viral, Ms.dhoni, Not Taken, Remuneration, Rohith Sharma, Sports, Updates-Latest News - Telugu

ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ ఈవెంట్ లో టీమిండియా అక్టోబర్ 24న పాకిస్థాన్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడనుంది.ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.అలాగే మూడు ఐసీసీ ట్రోపీలు నెగ్గిన ఏకైక కెప్టెన్ గా ధోనీ రికార్డ్ సైతం క్రియేట్ చేసాడు.కమహీ కెప్టెన్సీలో భారత్ 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ నెగ్గింది.

రెండేళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపొందింది.ప్రస్తుతం మహేంద్ర సింగ్ కేవలం చెన్నై సూపర్ కింగ్స్ కు మాత్రమే కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.

క్రికెట్ ఆట ఆడడంలో మన మహేంద్ర సింగ్ హీరో ఎలాగో వ్యక్తిత్వంలో కూడా అసలు సిసలు హీరో అని మరోసారి నిరూపించాడు.

#Dhoni Money #Kohli #Bcci Jay #Rohith Sharma #MSDhoni

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు