చెన్నై ఓటమికి ధోనీనే కారణం… ధోనీ పై గౌతమ్ గంభీర్ తీవ్రవిమర్శలు..!  

Gautam Gambhir Sensational Comments on MS Dhoni, CSK lost, MS Dhoni, Gautham Gambhir, IPL2020 - Telugu Csk Lost, Gautam Gambhir Sensational Comments On Ms Dhoni, Gautham Gambhir, Ipl2020, Ms.dhoni, Rajasthan Royals

మంగళవారం నాడు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సిక్సర్ల వర్షం కురిసింది.మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలర్స్ పై విరుచుకుపడింది.

TeluguStop.com - Dhoni Is The Reason To Loss Match Chennai Super Kings

ఇందులో భాగంగానే రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సంజు శాంసన్ ఆకాశమే హద్దుగా ఏకంగా తొమ్మిది సిక్సర్లను బాదాడు.ఈయనకు తోడుగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా బ్యాట్ ను ఝుళిపించాడు.

చివర్లో ఆర్చర్ కూడా కేవలం ఎనిమిది బంతుల్లో 4 సిక్సర్లలను కొట్టగా చెన్నై సూపర్ కింగ్స్ ఎదుట ఏకంగా 217 భారీ విజయలక్ష్యాన్ని ఉంచారు.

TeluguStop.com - చెన్నై ఓటమికి ధోనీనే కారణం… ధోనీ పై గౌతమ్ గంభీర్ తీవ్రవిమర్శలు..-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే లక్ష్యఛేదనలో భాగంగా బ్యాటింగ్ మొదలుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట్లో ఆచితూచి ఆడిన షేన్ వాట్సన్ అవుట్ అయ్యాక వచ్చిన డుప్లెసిస్ కూడా ఆకాశమే హద్దుగా అన్నట్లుగా బ్యాటింగ్ చేశాడు.

అయితే డుప్లెసిస్ ఒకవైపు విజృంభిస్తుంటే మరో వైపు వచ్చి న చెన్నై ఆటగాళ్లు ఒక్కొక్కరు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు.ఇక ఇదే క్రమంలో 7 వికెట్ ఆటగాడిగా మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులోకి ఆలస్యంగా వచ్చాడు.

అయితే అప్పటికే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయింది.దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఓటమి తప్పలేదు.

ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టార్గెట్ అంత పెద్దగా ఉన్న 7వ నెంబర్ బ్యాట్స్మెన్ క్రిజ్ లోకి రావడం ఏంటో అర్థం కావట్లేదని టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ మహేంద్రసింగ్ ధోని పై తీవ్ర విమర్శలు చేశారు.చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 114 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన సమయంలో బ్యాటింగ్ కు వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ, ఆ సమయానికి ఇంకా 103 పరుగులు అవసరం ఉండగా ఆచితూచి ఆడటం ఏంటని ఆయన పై అభిప్రాయపడ్డారు.

ఈ విషయాన్ని గౌతం గంభీర్ ఈఎస్పిఎన్ క్రికెట్ ఇన్ఫో వారు జరిపిన ఇంటర్వ్యూలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

#MS.Dhoni #Gautham Gambhir #GautamGambhir #CSK Lost #IPL2020

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dhoni Is The Reason To Loss Match Chennai Super Kings Related Telugu News,Photos/Pics,Images..