కోహ్లీ ఔట్‌ని బ్రిలియంట్‌గా ప్లాన్ చేసిన ధోనీ... వీడియో వైరల్..!

ఒక క్రికెట్ జట్టు గెలుపొందాలి అంటే అందులో కెప్టెన్ పాత్ర ఎంతో కీలకం.టీమ్ లో స్ట్రాటజిక్ స్కిల్స్ ఉన్న కెప్టెన్ ఒకరుంటే చాలు 50% గేమ్ గెలిచినట్లే.

 Dhoni Brilliant Strategy To Dismiss Kohli In Ipl 2022 Csk Vs Rcb Details, Viral-TeluguStop.com

అయితే అలాంటి గొప్ప కెప్టెన్సీ స్కిల్స్ మహేంద్ర సింగ్ ధోనీలో అందరి కంటే కాస్త ఎక్కువగానే ఉన్నాయి.మిస్టర్ కూల్ నాయకత్వంలో టీమిండియా ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను సొంతం చేసుకోవడమే దీనికి నిదర్శనం.

ఎవరిని ఎలా ఔట్ చేయాలో ధోనీకి బాగా తెలుసు.ధోనీ ప్లాన్ చేసాడంటే ప్రత్యర్థి జట్టు బ్యాటర్ ఔట్ అవ్వాల్సిందే.

తాజాగా జరిగిన ఓ ఐపీఎల్ 2022 మ్యాచ్ లో కోహ్లీ విషయంలో కూడా ఇదే జరిగింది.ఈ మ్యాచ్ లో కోహ్లీ ఔట్‌ని ధోనీ బ్రిలియంట్‌గా ప్లాన్ చేశాడు.

డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2022లో తమ మొదటి మ్యాచ్‌లో విజయం సాధించింది.మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై జట్టు 23 పరుగుల తేడాతో గెలుపొందింది.

సీఎస్‌కే నాలుగు వికెట్ల నష్టానికి 216 భారీ స్కోరు చేయగా.ఆర్‌సీబీ ఈ భారీ లక్ష్య ఛేదనలో విఫలమయ్యింది.

స్టార్ బ్యాటర్లు ఫాఫ్ డుప్లెసిస్ (8), విరాట్ కోహ్లీ (1) సరిగా రాణించక పోవడంతో ఆర్‌సీబీ నిర్ణీత ఓవర్లలో 193 పరుగులు చేయగలిగింది.

అయితే కోహ్లీ కేవలం ఒక పరుగుకే ఔట్ కావడానికి కారణం ధోనీ అని చెప్పవచ్చు.

సీఎస్‌కే కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజాకు ఎప్పటికప్పుడు ఫీల్డ్ ప్లేస్‌మెంట్‌ల్లో ధోనీ హెల్ప్ చేస్తున్నాడు.అయితే ఈ మిస్టర్ కూల్ పదేళ్లకు పైగా కోహ్లీతో కలిసి ఆడిన అనుభవం ఉంది.

కొన్ని డెలివరీలకు కోహ్లీ ఎలా స్పందిస్తాడో ధోనీకి బాగా తెలుసు.

అలా తనకున్న నాలెడ్జ్ ని ఉపయోగించి బౌలర్ ముకేశ్ చౌదరిని పుల్ షాట్‌కు బౌల్ చేయమని చెప్పాడు.ఇలాంటి బంతిని కోహ్లీ డీప్ స్క్వేర్ లెగ్‌లోకి కొడతాడని ఉహించి అక్కడ ఓ ఫీల్డర్‌ని ఉంచాడు.ఆ తర్వాత ముకేశ్ చౌదరి ఐదో ఓవర్ తొలి బంతిని పుల్ షాట్ కి వేశాడు.

కోహ్లి ఆ బాల్ ని ధోనీ ఊహించినట్లే డీప్ స్క్వేర్ లెగ్‌లోకి కొట్టాడు.అదే ప్లేస్ లో ధోనీ ఉంచిన ఫీల్డర్‌ శివమ్ దూబే ఆ బంతిని క్యాచ్ పట్టుకున్నాడు.

దీంతో కోహ్లీ ఔట్ అయ్యాడు.కోహ్లి కోసం ధోనీ ఫీల్డ్‌ని సెట్ చేసిన మొత్తం ప్రక్రియ ఇప్పుడు వీడియో రూపంలో వైరల్ గా మారింది.

దీన్ని చూసిన ఫ్యాన్స్ వాట్ ఏ బ్రిలియంట్ కెప్టెన్ అంటూ కితాబిస్తున్నారు.ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube