బుల్లితెరపై ఎన్నో రియాలిటీ, ఎంటర్టైన్మెంట్ షోలు ప్రసారమవుతున్నాయి.డాన్స్, సింగింగ్, కామెడీ ఇలా పలు రకాల ఎంటర్టైన్మెంట్ లు రాగా.
అప్పుడప్పుడు ఈ షోలు ఓ బృందంలా మారి ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకోవడానికి స్పెషల్ ఈవెంట్ అని కూడా చేస్తుంటారు.ఇదిలా ఉంటే రియాల్టీ షో లలో చాలావరకు పర్యవేక్షణలో జరుగుతుంటాయి.
ఒక్కోసారి అందులో పబ్లిసిటీ కోసం కొన్ని సన్నివేశాలు కూడా చేస్తుంటారు.ఇదిలా ఉంటే తాజాగా ఓ డాన్స్ షో లో ఘోర ప్రమాదం జరుగగా.
కంటెస్టెంట్ కి తీవ్ర గాయం జరిగిన సంఘటన చోటు చేసుకుంది.
ఈటీవీలో ప్రసారమవుతున్న ప్రముఖ డాన్స్ షో ఢీ.
ఈ షో ఇప్పటివరకు 12 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగా ప్రస్తుతం 13 వ సీజన్ లో మరింత ఎంటర్టైన్మెంట్ తో దూసుకుపోతుంది.ఇక ఇందులో పాల్గొని యాంకర్, జడ్జిలు ఒక ఎత్తయితే డాన్స్ లు చేసే కంటెస్టెంట్ లు మరో ఎత్తు అని చెప్పవచ్చు.
ఎందుకంటే వాళ్లు చేసే డాన్స్ మాత్రం ఎంతో ఆశ్చర్యంగా ఉంటాయి.అంతేకాకుండా వాళ్ళు చేసే డాన్స్ లలో కొంచెం ఏదైనా జరిగినట్లయితే శరీరా ప్రమాదాలే జరుగుతాయి.
ఇదిలా ఉంటే తాజాగా వచ్చే ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా.అందులో ఎంటర్టైన్మెంట్, డాన్స్ లతో సాగుతూ ఉండగా ఓ లేడి కంటెస్టెంట్ స్టేజి చివర్లో డాన్స్ చేస్తూ స్టేజ్ కిందపడిపోయింది.ఇక ఆమె తలకు బాగా గాయం అవ్వగా రక్తస్రావం జరిగింది.దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఇదిలా ఉంటే ఒక్కోసారి ఈ షోలలో పబ్లిసిటీ కోసం కొన్ని స్టంట్లు చేస్తుంటారు.కానీ ఈ ఘటన చూస్తే అది ప్రమాదమా లేదా స్టంటా అనేది తెలియాలంటే ఏప్రిల్ 14 వరకు ఆగాల్సిందే.