ఆ డైరెక్టర్ చిరంజీవిని పక్కన పెట్టి చంద్రమోహన్ ను హీరోగా పెట్టమన్నారట.. ఏమైందంటే?

టాలీవుడ్ మెగాస్టార్ గా చిరంజీవికి పేరుప్రఖ్యాతులతో పాటు కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే.చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకోగా ఆగష్టు నెలలో థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

 Dhavala Satyam Interesting Comments About Chiranjeevi Goes Viral In Social Media-TeluguStop.com

ఫిల్మ్ డైరెక్టర్ ధవళ సత్యం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దర్శకునిగా ఎక్స్ పీరియన్స్ అద్భుతం అని ఆయన తెలిపారు.

లైఫ్ ను అన్ని కోణాలలో చూసే అదృష్టం తనకు దక్కిందని ఆయన చెప్పుకొచ్చారు.

నేను యాక్టింగ్ చేసినా ఎక్కువకాలం కెరీర్ ను కొనసాగించలేదని ఆయన చెప్పారు.ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎవర్ని గౌరవించాలో ఎవర్ని గౌరవించకూడదో తెలియదని ఆయన చెప్పారు.

తాను డైరెక్టర్ అయిన తర్వాత ఎవరిని హీరోగా చేయాలని చర్చ జరిగిందని ధవళ సత్యం చెప్పుకొచ్చారు.ఆ సమయంలో నేను చిరంజీవిని ఎంపిక చేశానని ఆయన అన్నారు.

చిరంజీవిని హీరోగా తీసుకోవడానికి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Chandramohan, Chiranjeevi, Dasari Yana Rao, Dhavala Satyam, Dhavalasatyam

అందరూ కొత్తవాళ్లు కావడంతో చిరంజీవిని ఎంపిక చేయాలని తాను అనుకున్నానని దాసరి నారాయణరావు చంద్రమోహన్ ను పెట్టాలని చెప్పారని ఆయన పేర్కొన్నారు.శివరంజని నాటికి చిరంజీవి హీరో కావాలని దర్శకుని ప్రోత్సాహం లేకపోవడంతో ఆయనను ఎంపిక చేయలేదని ఆయన తెలిపారు.

Telugu Chandramohan, Chiranjeevi, Dasari Yana Rao, Dhavala Satyam, Dhavalasatyam

చిరంజీవి బాగా యాక్ట్ చేసేవారని ధవళ సత్యం అన్నారు.చిరంజీవి ఆ సమయంలో చాలా బాధపడేవారని ఆయన అన్నారు.చిరంజీవి 5 సీన్ల క్యారెక్టర్ అయినా ఇవ్వాలని కోరగా తాను మాత్రం హీరో క్యారెక్టర్ ఇచ్చానని ధవళ సత్యం చెప్పుకొచ్చారు.

చిరంజీవి అప్పటినుంచే దర్శకుల భావాలను తెలుసుకునే ప్రయత్నం చేసేవారని ఆయన చెప్పుకొచ్చారు.చిరంజీవి ప్రస్తుతం వరుస రీమేక్ లలో నటిస్తుండగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి ఫలితాలను అందుకుంటాయో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube