రేవంత్‌పై సంచ‌ల‌న విష‌యాలు చెప్పిన ధ‌ర్మ‌పురి అర‌వింద్‌.. సీన్‌లోకి కేసీఆర్‌!

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో బీజేపీ, కాంగ్రెస్ మ‌ధ్య వార్ ఓ రేంజ్‌లో న‌డుస్తోంది.మొన్న‌టి వ‌ర‌కు ఈ వార్ అనేది అధికార టీఆర్ ఎస్‌పై ప్ర‌క‌టించిన ఈ రెండు పార్టీలు ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చీఫ్ అయిన త‌ర్వాత రూటు మార్చి ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌తో రెచ్చిపోతున్నాయి.

 Dharmapuri Aravind Who Said Sensational Things About Rewanth, Kcr Into The Scene-TeluguStop.com

ఇక ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేరిన‌ప్ప‌టి నుంచి చాలా సైలెంట్ గా ఉంటున్న ధ‌ర్మ‌పురి అర‌వింద్ ఇప్పుడు అనూహ్యంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి మ‌ళ్లీ హీటు పెంచారు.అదేంటంటే మొద‌టి నుంచి రేవంత్‌కు ధ‌ర్మపురి అర‌వింద్‌కు అస్స‌లు ప‌డ‌ద‌నే చెప్పాలి.

వీరిద్ద‌రూ ఇంత‌కు ముందు కూడా ఇలాగే ఆరోప‌ణ‌లు చేసుకున్నారు.

కాగా ఇప్పుడు మ‌ళ్లీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ చేయ‌డంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

రీసెంట్ గా ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొని అనేక విష‌యాల‌పై మాట్లాడారు.తాను బీజేపీని వీడేది లేద‌ని తాను రాజ‌కీయాల్లో ఉన్నంత వ‌ర‌కు బీజేపీలోనే కొన‌సాగుతానంటూ ప్ర‌క‌టించారు.

అయితే త‌న అన్న కాంగ్రెస్‌లో చేరిన విష‌యంపై త‌న‌కు సంబంధం లేద‌ని, త‌న అన్న విష‌యాల గురించి తాను ప‌ట్టించుకోనంటూ వెల్ల‌డించారు.ఇక రేవంత్ టీపీసీసీ ప్రెసిడెంట్ కావ‌డం వెన‌క పెద్ద కుట్ర ఉంద‌ని, ఆయ‌న కేసీఆర్‌కు ఏజెంట్ లా మారిపోయాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు.

Telugu Etela Rajender, Kcr Telangana, Revanth-Telugu Political News

నిజానికి సీనియ‌ర్ల‌ను కాద‌ని రేవంత్‌కు ఎలా ఇస్తార‌ని, దీని వెన‌క పెద్ద స్కామ్ ఉంద‌ని చెప్పారు.రేవంత్ రెడ్డి ఇన్ డైరెక్టుగా కేసీఆర్ స‌పోర్టుతోనే కాంగ్రెస్ చీఫ్ అయ్యార‌ని, ఇదంతా కేసీఆర్ ఆడుతున్న డ్రామా అని చెప్ప‌డం ఇప్పుడు పెద్ద సంచ‌ల‌నం రేపుతోంది.ఇప్ప‌టి వ‌ర‌కు రేవంత్ కు సొంత పార్టీ నేత‌లే స‌పోర్టుగా రావ‌ట్లేద‌ని, కాంగ్రెస్ కు అంత సీన్ లేద‌ని త‌మ పార్టీ రాబోయే కాలంలో అధికారంలోకి వ‌స్తుందంటూ చెప్పారు.అయితే ఇప్పుడు ధ‌ర్మపురి అర‌వింద్ చేసిన వ్యాఖ్య‌లు కాంగ్రెస్‌లో పెద్ద దుమార‌మే రేపుతున్నాయి.

మ‌రి ఆయ‌న‌కు రేవంత్ ఎలాంటి కౌంట‌ర్ ఇస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube