టీఆర్ఎస్ బీజేపీ మధ్య అగ్గి రాజుకుందిగా ?  

BJP MP Dharmapuri Aravind Fires on KCR, Anti hindus, Owaisi, TRS, telangana BJP, Bandi Sanjay - Telugu Anti Hindus, Bandi Sanjay, Bjp Mp Dharmapuri Aravind Fires On Kcr, Owaisi, Telangana Bjp, Trs

జోరు మీద ఉన్న తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ దూకుడు తగ్గించే విధంగా కొంత కాలంగా బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.బండి సంజయ్ తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, బిజెపిలో జోరు పెరిగింది.

 Dharmapuri Aravind Fires On Cm Kcr

టిఆర్ఎస్ ను ప్రతి విషయంలోనూ, అడ్డుకుంటూ ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ, ఆ పార్టీ దూకుడును తగ్గించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.అలాగే బిజెపి తెలంగాణలో ఎదగకుండా టిఆర్ఎస్ ఎక్కడికక్కడ అడ్డుకుంటూ వస్తోంది.

ఇదిలా ఉంటే, తాజాగా బీజేపీ టీఆర్ఎస్ మధ్య పోరు దాడుల వరకు వెళ్ళింది.నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ టిఆర్ఎస్ ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కారణం అయ్యాయి.

టీఆర్ఎస్ బీజేపీ మధ్య అగ్గి రాజుకుందిగా -Political-Telugu Tollywood Photo Image

‘ తెలంగాణలో ప్రజా వ్యతిరేక పాలన నడుస్తోందని, 2023 తర్వాత కేసీఆర్ కుటుంబం అడ్రస్ ఫామ్ హౌస్, ప్రగతి భవన్ కాదు, చంచల్ గూడ జైలే, కెసిఆర్, కేటీఆర్ కవిత, సంతోష్ ల కోసం జైల్లో 25 కోట్లతో ప్రత్యేక ఏసీ గదులు నిర్మించుకుంటున్నారు’ అంటూ అరవింద్ వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది.ఈ మేరకు ఆయన ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రాన్ని హిందూ వ్యతిరేక శక్తుల చేతుల్లో పెట్టిన దగుల్బాజీ హిందూ దొంగ కేసీఆర్ అంటూ మండిపడ్డారు.కెసిఆర్ మహమ్మద్ అలీ జిన్నా లాంటివాడు.అసదుద్దీన్ ఓవైసీ తన పెద్ద కొడుకులా చూసుకుంటూ, ఆయన అడుగు జాడల్లో రాష్ట్రాన్ని నడుపుతున్నాడు.హిందువుల రక్షణ కోసం ప్రధాని మోదీ తెచ్చిన సి ఏ ఏ ను వ్యతిరేకించి తన డొల్లతనాన్ని తెలియజేస్తున్నాడు.

ప్రజల పుణ్యాన గద్దెనెక్కి ఫామ్ హౌస్ లు నిర్మించుకుని, ప్రపంచవ్యాప్తంగా ఆస్తులు సంపాదించాడు అంటూ చాలా విమర్శలు చేశారు.

ఈ నేపథ్యంలో బిజెపి వరంగల్ అర్బన్ జిల్లా కార్యాలయంపై టీఆర్ఎస్ దాడికి పాల్పడటమే కాకుండా, ఎంపీ అరవింద్ పై టిఆర్ఎస్ దాడి చేసేందుకు ప్రయత్నించడం తో ఒక్క సారిగా రెండు పార్టీల మధ్య పోరు మొదలైంది.టిఆర్ఎస్ కార్యకర్తలు అకస్మాత్తుగా దాడి చేస్తారని బిజెపి ముందుగా ఊహించలేకపోయింది.ఇక ఆ తరువాత అప్రమత్తమైన బీజేపీ శ్రేణులు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ క్యాంపు కార్యాలయంపై దాడి చేసేందుకు ప్రయత్నించడం , పోలీసులు వారిని అడ్డుకోవడంతో చాలా హంగామానే నడిచింది.

ఎంపీ ధర్మపురి అరవింద్ పై జరిగిన దాడిని బిజెపి చాలా సీరియస్ గా తీసుకుని ఈ మేరకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, టిఆర్ఎస్ తీవ్రస్థాయిలో విమర్శిస్తూ హెచ్చరికలు చేశారు.

మా సహనాన్ని పరీక్షించవద్దు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని మర్చిపోవద్దు అంటూ హెచ్చరించారు.

పోతిరెడ్డిపాడు, కొవిడ్ రైతు సమస్యల పైన బిజెపి పోరాడుతోందని, అందుకే కేసీఆర్ కు భయం పట్టుకుందని, అరవడానికి కొంతమందిని కురవడానికి కొంతమందిని కెసిఆర్ పెట్టుకున్నారని, వాళ్లను చూసి బీజేపీ భయపడదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయం ఆషామాషీగా వదిలి పెట్టకూడదని, కేంద్ర బిజెపి పెద్దల వద్ద ఈ విషయంపై ఫిర్యాదు చేసి టిఆర్ఎస్ పై ప్రతీకారం తీర్చుకోవాలనే దిశగా బండి సంజయ్ అడుగులు వేస్తున్నారు.

ఇక ఈ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.

.

#Bandi Sanjay #Telangana BJP #Anti Hindus #Owaisi #TRS

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dharmapuri Aravind Fires On Cm Kcr Related Telugu News,Photos/Pics,Images..