ఉగ్రవాది అనుకుని భారతీయుడి అరెస్ట్...చివరికి ఏమయ్యిందంటే..!!!

మనలో చాలా మందికి పేర్లు అందరితో సమానంగా ఉంటాయి.కొందరి పేర్లు మనం రోజు వారి వింటూనే ఉంటాము, మరి కొందరి పేర్లు మాత్రం చాలా వింతగా ఉంటాయి.

 Dhar Nazir Ahamadh Arrest In Iraq Airport-TeluguStop.com

ఇంకొందరి పేర్లు అసలు ఎలా పెడుతారో కూడా అర్థం కాదు.అయితే ఒక్కో సారి ఈ పేర్ల తాలూకు ఎఫెక్ట్ లు మనల్ని అరెస్ట్ చేసేసే స్థాయికి తీసుకు వెళ్తాయి.

ఇలాంటి సంఘటనే ఓ భారతీయుడికి ఎదురయ్యింది.వివరాలోకి వెళ్తే…

Telugu Dharnazir, Iraqdhar, Kshmir Iraq, Terrorist-

కాశ్మీర్ కి చెందిన ఓ వ్యక్తి తీర్ధయాత్రల కోసమని ఇరాక్ వెళ్ళాడు.అక్కడ ఆల్ నజాఫ్ ఎయిర్ పోర్ట్ లో విమానం ఎక్కడానికి వెయిట్ చేస్తున్నాడు.కొంత సమయం గడిచిన తరువాత కొందరు అధికారులు వచ్చి అరెస్ట్ చేశారు.

ఈ ఘటనతో అతడు షాక్ అయ్యాడు.అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనడిగినా వారు సమాధానం చెప్పలేదు.

అసలు కారణం చెప్పమని అడుగగా అప్పుడు ఇతడు భయంకర ఉగ్రవాదని చెప్పారు.

Telugu Dharnazir, Iraqdhar, Kshmir Iraq, Terrorist-

అతడి పేరు దార్ నజీర్ అహ్మద్.ఈ పేరుమీద ఓ భయంకరమైన ఉగ్రవాది పేరు ఉండటంతో పాటు సదరు ఉగ్రవాది కూడా జమ్మూ కాశ్మీర్ కి చెందిన వారు, అంతేకాదు ఇద్దరి వయసు కూడా ఒక్కటే కావడంతో ఉగ్రవాది ఇతడేఅనుకుని అదుపులోకి తీసుకున్నారు.కానీ అతడు ఉగ్రవాది కాదని, సాధారణ పౌరుడేనని దర్యాప్తులో తెలియడంతో ఇంటర్ పోల్ నుంచీ పూర్తి నివేదిక వచ్చిన తరువాతనే అతడిని వదులుతామని చెప్పారు పోలీసులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube