నేను మద్యం తాగలేదు.. ప్రముఖ నటి కామెంట్స్ వైరల్..?

తెలుగులో చేసింది తక్కువ సినిమాలైనా హీరోయిన్ గా పరవాలేదనిపించే స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నారు ధన్య బాలకృష్ణన్.తెలుగమ్మాయి కాకపోయినప్పటికీ తెలుగమ్మాయిలా కనిపించే ధన్య బాలకృష్ణన్ రాజుగారిగది, నేను శైలజ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రాజా రాణి, సాఫ్ట్ వేర్ సుధీర్, మరికొన్ని సినిమాలతో మంచి పేరును సంపాదించుకున్నారు.

 Dhanya Balakrishnan Interesting Comments About Drinking Scenes-TeluguStop.com

ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన ధన్య బాలకృష్ణన్ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్లతో ముచ్చటించారు.

ప్రస్తుతం తాను బెంగళూరులో ఉన్నానని ఆమె అన్నారు.

 Dhanya Balakrishnan Interesting Comments About Drinking Scenes-నేను మద్యం తాగలేదు.. ప్రముఖ నటి కామెంట్స్ వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పవన్ కళ్యాణ్, రణబీర్ కపూర్, సూర్య తన క్రష్ అని ధన్య చెప్పుకొచ్చారు.ఇష్టమైన వంటకాలు ఏమిటని నెటిజన్ ప్రశ్నించగా తాన్ నాన్ వెజ్ తిననని తనకు పెరుగన్నం ఇష్టమని ధన్య తెలిపారు.

రోజువారీ దినచర్య గురించి ప్రశ్నలు ఎదురు కాగా అమ్మనాన్నల సరదా గొడవలు చూడటం, కాఫీ తాగడం, ఇంటిని శుభ్రం చేయడం, వంట చేయడం మన దినచర్య అని ఆమె తెలిపారు.

మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించడం గురించి మాట్లాడుతూ మహేష్ బాబుతో కలిసి పని చేయడం తనకు ఎంతగానో నచ్చిందని ఆమె అన్నారు.

ఓర్పు, సహనంతో పాటు మహేష్ మంచి మనస్సు ఉన్న వ్యక్తి అని ధన్య బాలకృష్ణన్ పేర్కొన్నారు టైటానిక్ మూవీ తనకు ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ అని ఆమె తెలిపారు.తన ముద్దుపేరు పప్పు అని ధన్య వెల్లడించారు.

తన పాత్రలను గుర్తు పెట్టుకొని సపోర్ట్ చేస్తున్న అభిమానులకు ధన్యవాదాలు అని ఆమె పేర్కొన్నారు. పునీత్ రాజ్ కుమర్ కన్నడలో తన ఫేవరెట్ యాక్టర్ అని ఆమె అన్నారు.

రాజా రాణి సినిమాలో తాను మద్యం తాగినట్టు చూపించారని కానీ తనకు మద్యం తాగే అలవాటు లేదని ఆ సన్నివేశంలో తాను మంచి నీళ్లు తాగానని ధన్య బాలకృష్ణన్ పేర్కొన్నారు.

#Drinking Water #Drinking Scenes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు