'సార్' ఫస్ట్ లుక్ వచ్చేసింది.. అదిరిపోయిన ధనుష్.. టీజర్ ఎప్పుడంటే?

జాతీయ నటుడిగా అవార్డు అందుకున్న నటుడు ధనుష్ గురించి తెలియని ప్రేక్షకులు లేరు.ఈయన కోలీవుడ్ లో స్టార్ హీరోల్లో ఒకరు.

 Dhanush’s Sir First Look Poster Released, Sir First Look, Sir Movie, Dhanush,-TeluguStop.com

అయితే ధనుష్ అక్కడే ఉండిపోకుండా ఇటు తెలుగుతో పాటు హిందీ, హాలీవుడ్ మూవీస్ లో కూడా తనని తాను నిరూపించు కునేందుకు తీవ్రంగా కష్టపడు తున్నాడు.ధనుష్ నటిస్తున్న సినిమాలన్నీ డబ్బింగ్ అయ్యి తెలుగులో కూడా రిలీజ్ అవుతూనే ఉన్నాయి.

కానీ ఈయన మార్కెట్ పెంచుకోవడంతో మాత్రం కొద్దిగా వెనుకబడి ఉన్నాడు.ధనుష్ తెలుగులో కమర్షియల్ హిట్ సాధించలేదు.

 Dhanush’s Sir First Look Poster Released, Sir First Look, Sir Movie, Dhanush,-TeluguStop.com

దీంతో ఈయన డైరెక్ట్ తెలుగు సినిమాతో రాబోతున్నాడు.ప్రెసెంట్ ధనుష్ తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించాడు.ఈ సినిమా పట్టాలెక్కక ముందే మరో డైరెక్టర్ తో సినిమా ప్రకటించి షూటింగ్ కూడా స్టార్ట్ చేసాడు.ప్రెసెంట్ ధనుష్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేసాడు.‘సార్‘ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యి శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.ఈ సినిమా ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.తాజాగా సార్ నుండి ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

ఈ రోజు కొద్దీ సేపటి క్రితం సార్ సినిమా నుండి ధనుష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు.ఇందులో ధనుష్ లెక్చరర్ పాత్రలో నటిస్తున్నాడు.

అందుకే ఈ సినిమాకు సార్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు.ఫస్ట్ లుక్ లో ధనుష్ చైర్ లో కూర్చుని సీరియస్ గా ఏదో రాస్తున్నట్టు బిజీగా ఉన్నాడు.

ఈ లుక్ అందరిని అలరించింది.ఇక ఫస్ట్ లుక్ తో పాటు రేపు టీజర్ కూడా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు.

మరి ఇది ఎలా ఉంటుందో చూడాలి.

Telugu Dhanush, Dhanushssir, Kollywood, Sekhar Kammula, Sir, Tollywood, Venky At

ఇక ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో ఏకకాలంలో తెరకెక్కుతుంది.వాతి పేరుతొ తమిళ్ లో రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాను సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా సితార ఎంటెర్టాన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పథకాలపై నిర్మిస్తుండగా.

సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.జివి ప్రకాష్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube