సమంత ఖాతాలో మరోటి

సమంత ఇటు టాలీవుడ్‌, అటు కోలీవుడ్‌లలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీ హీరోయిన్‌గా ఉంది.తెలుగులో ఇప్పటికే నెం.

1 హీరోయిన్‌ అనిపించుకున్న ఈ అమ్మడు తాజాగా తమిళంపై ఎక్కువ దృష్టి పెట్టింది.పలు సినిమాలు చేసిన తర్వాత తమిళంలో ‘కత్తి’ సినిమాతో బంపర్‌ హిట్‌ కొట్టిన సమంతకు ప్రస్తుతం అక్కడ వరుసగా ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది.

అయితే వాటిల్లోంచి ఏరి కోరి, ఆలోచించి మరీ ఓకే చెబుతోంది.తాజాగా సమంతకు స్టార్‌ హీరో ధనుష్‌ నుండి పిలుపు వచ్చింది.ఈ అమ్మడు ‘కత్తి’ సినిమాతో సక్సెస్‌ కొట్టడంతో ధనుష్‌ ఈమెతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది.

‘వీఐపీ’తో రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్న ధనుష్‌ ప్రస్తుతం వేల్రాజ్‌ దర్శకత్వంలో నటించేందుకు సిద్దం అవుతున్నాడు.‘వీఐపీ’ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించిన వేల్రాజ్‌ ఒక కమర్షియల్‌ స్క్రిప్ట్‌ను ధనుష్‌ కోసం సిద్దం చేస్తున్నాడు.

Advertisement

ఆ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్‌గా అమీ జాక్సన్‌ను ఎంపిక చేయడం జరిగింది.తాజాగా మరో హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమా వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో సెట్స్‌ పైకి వెళ్లబోతుంది.

Advertisement

తాజా వార్తలు