ప్రభాస్ బాటలో ధనుష్.. సెట్ అయ్యేనా?  

Dhanush To Follow Prabhas, Dhanush, Prabhas, Prabhas 21, Nag Ashwin, Kollywood News - Telugu Dhanush, Kollywood News, Nag Ashwin, Prabhas, Prabhas 21

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ రాధేశ్యామ్ ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమా పూర్తిగాకముందే తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి లైన్‌లో పెడుతున్నాడు డార్లింగ్.

TeluguStop.com - Dhanush To Follow Prabhas

ఈ క్రమంలోనే మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సూపర్ హీరో మూవీలో నటించేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాను పూర్తి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

టైమ్ ట్రావెల్‌కు సంబంధించిన కథతో ఈ సినిమా రానున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది.

TeluguStop.com - ప్రభాస్ బాటలో ధనుష్.. సెట్ అయ్యేనా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక ప్రభాస్ దారిలో వెళ్లేందుకు ఓ స్టార్ హీరో రెడీ అవుతున్నాడు.

తమిళ స్టార్ హీరో ధనుష్ ఇటీవల వరుసబెట్టి సినిమాలు చేస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తమిళంలో ‘రాచ్చసన్’ చిత్రాన్ని తెరకెక్కించిన రామ్ కుమార్ డైరెక్షన్‌లో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నటించేందుకు ధనుష్ రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాకు ‘వాల్ నచ్చతిరం’ అనే టైటిల్‌ను పెట్టగా, ఇప్పటికే ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఈ సినిమాతో ధనుష్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

మరి ప్రభాస్ దారిలో సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటించనున్న ధనుష్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అనే ఆసక్తి కోలీవుడ్ వర్గాల్లో నెలకొంది.ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు సదరు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఈ సినిమాలో ధనుష్ సరసన ఓ స్టార్ బ్యూటీ ఉండబోతుందని చిత్ర యూనిట్ తెలిపింది.మరి ఈ సినిమాతో ధనుష్ సక్సెస్ అందుకుంటాడా లేక బొక్కబోర్లా పడతాడా అనేది చూడాలి.

#Prabhas #Dhanush #Nag Ashwin #Prabhas 21

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dhanush To Follow Prabhas Related Telugu News,Photos/Pics,Images..