ట్రైలర్‌ టాక్‌ : మరో అద్బుతంను ఆవిష్కరించేందుకు సిద్దం

తమిళ స్టార్‌ ధనుష్ హీరోగా వచ్చిన కర్ణన్‌ మూవీ సూపర్‌ సక్సెస్‌ ను దక్కించుకున్న విషయం తెల్సిందే.ఆ సినిమా బ్లాక్ బస్టర్‌ సక్సెస్ అయిన నేపథ్యంలో మరో అద్బుతంను ఆవిష్కరించేందుకు ధనుష్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

 Dhanush Telugu Film Jagame Thantram Trailer Review , Dhanush,  Film News,  Jagam-TeluguStop.com

ధనుష్ హీరోగా రూపొందిన జగమే తంత్రం విడుదలకు సిద్దం అయ్యింది.ఈ సినిమా ను నెట్‌ ఫ్లిక్స్ ద్వారా విడుదల చేయబోతున్నారు.

ధనుష్ లుక్ ఇప్పటికే సినిమాపై అంచనాలు క్రియేట్‌ చేయడం లో సక్సెస్‌ అయ్యింది.ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో నెట్‌ ఫ్లిక్స్ భారీ మొత్తంను ఈ సినిమాకు పెట్టినట్లుగా సమాచారం అందుతోంది.

ఇక ఈ సినిమా ట్రైలర్‌ ను విడుదల చేశారు.అంతా ఊహించినట్లుగానే ట్రైలర్‌ దుమ్ము రేపింది.

ధనుష్‌ మూడు నాలుగు వేరియేషన్స్ ఉన్న పాత్రలో గెటప్ లో కనిపించడంతో పాటు ఓ భారీ యాక్షన్‌ సినిమా ను తలపిస్తూ ఉంది.

ధనుష్ ఈ సినిమా ను ప్రత్యేకమైన శ్రద్దతో చేయడం జరిగింది.

వరుసగా ఆయన చేస్తున్న సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా అంచనాలు పెంచే విధంగా ఉంటుందని ట్రైలర్‌ చూస్తుంటేనే అర్థం అవుతోంది.ధనుష్‌ ను ప్రేక్షకులు ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా ఈ సినిమాలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు చూపించబోతున్నాడు.

కొన్ని సన్నివేశాల్లో ధనుష్‌ కు బదులు రజినీకాంత్‌ కనిపిస్తున్నాడు.ట్రైలర్‌ లో మరో కర్ణన్‌ ను చూపించడం తో పాటు అద్బుతమైన విజువల్స్ తో హాలీవుడ్‌ బాలీవుడ్‌ సినిమా అన్న రేంజ్ లో ఉందనే టాక్‌ వస్తుంది.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్ట్రీమింగ్‌ కోసం ప్రేక్షకులు ఎదురు చూసేలా ట్రైలర్‌ ఉంది.ఈనెల 18న చిత్రం ను నెట్‌ ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు.ఈ సినిమా లో ధనుష్‌ పాత్ర గతంలో ఎప్పుడు లేని విధంగా ఉందంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube