స్టార్ డైరక్టర్ స్ట్రగుల్.. ఛాన్స్ ఇచ్చిన తమ్ముడు ధనుష్  

Dhanush New Project With Brother Selva Raghavan-dhanush,dhanush New Movies,rajanikanth,tollywood Gossips,viral In Social Media

కోలీవుడ్ లో ఒకప్పుడు వరుస విజయాలతో సౌత్ ఇండస్ట్రీని ఆకర్షించిన దర్శకుడు సెల్వా రాఘవన్. ముఖ్యమా కాదల్ కొండెన్ (తెలుగులో నేను రీమేక్) – 7/g రెయిన్ బో కాలనీ (బృందావన కాలనీ) సినిమాలతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన ఈ దర్శకుడు అతని తమ్ముడు ధనుష్ స్టార్ గా ఎదగడానికి ఎంతో కృషి చేశాడు..

స్టార్ డైరక్టర్ స్ట్రగుల్.. ఛాన్స్ ఇచ్చిన తమ్ముడు ధనుష్-Dhanush New Project With Brother Selva Raghavan

విమర్శలు ఎన్ని వచ్చినా తమ్ముడితోనే కొన్ని సినిమాలు డైరెక్ట్ చేసి మంచి కెరీర్ ని ఇచ్చాడు. అయితే ఇప్పుడు అన్నయ్యతో సినిమా చేయడానికి చిన్న హీరో కూడా ఒప్పుకోవడం లేదు. NGK ప్లాప్ అనంతరం సెల్వా రాఘవన్ పనయిపోయిందని కామెంట్ వచ్చాయి.

ఈ తరుణంలో అన్నయ్యతో సినిమా చేయడానికి ధనుష్ స్ట్రాంగ్ గా ఫిక్సయినట్లు తెలుస్తోంది..

ప్రస్తుతం అసురన్ చిత్రంతో పాటు కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలతో ధనుష్ బిజీగా ఉన్నాడు. అలాగే థురై సెంథిల్ లో కూడా ఒక ప్రాజెక్ట్ కి కమిటయ్యాడు. అసురన్ షూటింగ్ అయిపోగానే సెల్వా రాఘవన్ తో కొత్త ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ధనుష్ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.