తుస్సుమన్న పటాస్‌ను పట్టుకొస్తు్న్న లోకల్ బాయ్  

Dhanush Local Boy Release Date Fixed - Telugu Dhanush, Jagapathi Babu, Local Boy, Mehreen, Pattas, Telugu Movie News

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన రీసెంట్ మూవీ ‘పటాస్’ తమిళంలో సంక్రాంతి కానుకంగా జనవరి 15న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమా తమిళనాట ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

Dhanush Local Boy Release Date Fixed - Telugu Dhanush, Jagapathi Babu, Local Boy, Mehreen, Pattas, Telugu Movie News-Gossips-Telugu Tollywood Photo Image

దీంతో ఇది యావరేజ్ మూవీగా అక్కడ నిలిచింది.కాగా ఈ సినిమాను ‘లోకల్ బాయ్’ పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు అప్పుడే ప్రకటించిన చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్ చేశారు.

ధనుష్ సరికొత్త అవతారంలో కనిపించే ఈ సినిమాను ఫిబ్రవరి 28న తెలుగులో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.ఈ సినిమాలో ధనుష్ డ్యుయెల్ రోల్‌లో నటించగా, మెహ్రీన్ హీరోయిన్‌గా నటించింది.

పక్కా మాస్ అంశాలు కలగలిసిన ఈ సినిమాను దురై సెంథిల్ కుమార్ డైరెక్ట్ చేయగా సత్యజోతి ఫిలింస్ బ్యానర్‌పై తమిళంలో రిలీజ్ చేశారు.ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు.

స్నేహ, జగపతి బాబు, నవీన్ చంద్ర లాంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాను తెలుగులో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంత మేర మెప్పిస్తుందో తెలియాలంటే ఫిబ్రవరి 28 వరకు ఆగాల్సిందే.

తాజా వార్తలు