మే 14 నుంచి ఒటీటీ లో కర్ణన్ చూడొచ్చు

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ విభిన్న చిత్రాలతో ఎప్పటికప్పుడు తన ప్రత్యేకత చాటుకుంటూ ఉంటాడు.మల్టీ టాలెంటెడ్ అయిన ధనుష్ హీరోగా తన ఇమేజ్ ని హాలీవుడ్ రేంజ్ కి పెంచుకున్నాడు.

 Dhanush Karnan Movie Amazon Prime Ott Release Date Confirmed-TeluguStop.com

సౌత్ నుంచి హాలీవుడ్ సినిమాలలో నటిస్తున్న ఏకైన స్టార్ హీరోగా ధనుష్ ఉన్నాడు.ఇదిలా ఉంటే ధనుష్ ఏప్రిల్ 8న కర్ణన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని 50 శాతం ఆక్యుపెన్సీతో మంచి కలెక్షన్స్ ని రాబట్టింది.అయితే కరోనా సెకండ్ వేవ్ ఉధృతం అవుతూ ఉండటంతో తమిళనాడులో థియేటర్స్ క్లోజ్ కావడంతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సినిమాని ఆపేయాల్సి వచ్చింది.

 Dhanush Karnan Movie Amazon Prime Ott Release Date Confirmed-మే 14 నుంచి ఒటీటీ లో కర్ణన్ చూడొచ్చు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ఇప్పుడు ఇప్పటికే ఈ సినిమా రీమేక్ హక్కులని బెల్లంకొండ సురేష్ సొంతం చేసుకున్నాడని తెలుస్తుంది.

రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తెరకెక్కించిన ఈ సినిమా మాస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఆవిష్కరించారు.

బెల్లంకొండ శ్రీనివాస్ తో ఈ సినిమాని రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కర్ణన్ మూవీ ఒటీటీలో రిలీజ్ కి రెడీ అయ్యింది.

అమెజాన్ ప్రైమ్ ఛానల్ ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని సొంతం చేసుకుంది.ఇక తాజాగా అమెజాన్ ప్రైమ్ నుంచి అఫీషియల్ గా రిలీజ్ డేట్ ఎనౌన్స్ ప్రకటన వచ్చింది.

మే 14న ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కాబోతున్నట్లు స్పష్టం చేశారు.మరి థియేటర్స్ లో అలరించిన ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులని ఏ మేరకు మెప్పిస్తుంది అనేది వేచి చూడాలి.

#Kollywood #MassAction #Hero Dhanush #Corona Effect #Remake Rights

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు